Neeraj Chopra:ఫైనల్ కు చేరిన ఇద్దరు భారతీయ బళ్లెం వీరులు

ఫైనల్ కు చేరిన ఇద్దరు భారతీయ బళ్లెం వీరులు: భారత బళ్లెం వీరుడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తన సత్తా చాటాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో ఫైనల్ చేరుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్ శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రూప్-ఏ లో నీరజ్ చోప్రా జావెలిన్ ను 88.39 మీటర్ల దూరం విసిరి అగ్ర స్థానం లో నిలిచాడు. ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా రెండవ స్థానంలో ఫైనల్ చేరాడు. మొదటి ప్రయత్నంలో జావెలిన్ ను 88.39 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో నీరజ్ చోప్రా ఫౌల్ చేశాడు.

రోహిత్ యాదవ్ అయిన మరొక భారతీయ జావెలిన్ త్రోయర్ ఫైనల్ కు అర్హత సాధించాడు. రోహిత్ యాదవ్ గ్రూప్ బి లో పోటీపడి జావెలిన్ ను 80.42మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించాడు. మొత్తం 12 మంది ఫైనల్ కు అర్హత సాధించారు.అందులో ఇద్దరు ఇండియన్ జావెలిన్ త్రోయర్స్ వుండటం ఇదే మొదటిసారి.

Neeraj Chopra:ఫైనల్ కు చేరిన ఇద్దరు భారతీయ బళ్లెం వీరులు
Neeraj Chopra: ఫైనల్ కు చేరిన ఇద్దరు భారతీయ బళ్లెం వీరులు

గ్రెనెడాకు చెందిన అండర్పన్ పీటర్సన్ 89.91 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా కంటే అగ్ర స్థానంలో ఉన్నాడు. నీరజ్ చోప్రా కు, ప్రధాన పోటీ అండర్పన్ పీటర్సన్ తోనే వుంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అతను మూడు సార్లు 90 మీటర్ల మార్క్ను అందుకున్నాడు.

నీరజ్ చోప్రా,ఫిన్‌లాండ్‌ కు చెందిన ఒలివర్ హెలాండర్ కు పోటీ ఇవ్వనున్నాడు. గురువారం జరిగిన మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ లో అన్ను రాణి ఫైనల్ కు చేరింది.ఆన్ను రాణి జావెలిన్ ను 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించింది.ఇక ఆదివారం ఫైనల్ రౌండ్స్ జరగబోతున్నాయి.దీనిలో నీరజ్ చోప్రా మెడల్ సాధిస్తే, మెడల్ సాధించిన రెండో భారత అథ్లెట్ గా చరిత్రకెక్కుతాడు.

అంజూ బాబి 19 ఏళ్ల క్రితం 2003లో లాంగ్ జంప్ లో కాంస్య పథకం గెలిచింది. ఆ తర్వాత మరే ఇండియన్ కూడా అథ్లెట్ పథకం సాధించలేకపోయాడు. నీరజ్ చోప్రా తన జీవితంలో మొట్టమొదటిసారిగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ ఆడుతున్నడు. నీరజ్ చోప్రా భారతదేశ నిరీక్షణను తెగదించుతాడని ప్రజలంతా భావిస్తున్నారు.