Nokia 2660 Flip: ఫీచర్స్, లాంచ్ డేట్

Nokia 2660 Flip 4G: ఫోర్ జి కనెక్టుతో అదిరిపోయే ఫీచర్లతో వరుసగా ఫోన్లను తీసుకొస్తున్న నోకియా. స్మార్ట్ ఫోన్లు పెద్దగా హిట్టు కాకపోవడంతో ఇంకా 4g ఫీచర్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిని పెటింది.  ఇదే క్రమంలో భారత్ లో మరొక 4జి ఫ్లిప్ ఫోను విడుదల చేసింది. నోకియా 260 ఫ్లిప్ 4జి ఫీచర్ ఫోన్ ను భారత్ కు తీసుకొచ్చింది.

ఇటీవల గ్లోబల్ గా లాంచ్ అయిన ఈ ఫోన్ ఎప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీని యొక్క ప్రాసెసర్ UniSoc T107 తో వస్తుంది. ఇందులో 2.8 అంగుళాల QVGA రెజల్యూషన్ డిస్ప్లే కూడా ఉంది. ఫోను ఫ్లిప్ చేసినప్పుడు 1.77 అంగుళాల QQVGA డిస్ప్లే బయట ఉంటుంది.

Nokia 2660 Flip 4G

ఈ ఫోనును ఫ్లిప్ చేసినప్పుడు ఈ రెండో డిస్ప్లే పై సాధారణ నోటిఫికేషన్లు, ఫోన్ కాల్ నోటిఫికేషన్లు, టైమ్ లాంటివి చూడవచ్చు. UniSoc T107 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంటుంది. 48GB RAM, 128GB ROM తో ఈ ఫోన్ వస్తుంది. మైక్రో ఎస్డి కార్డుతో 32 GB వరకు ROM ను పెంచుకోవచ్చు. నోకియా 2660 ఫ్లిప్ ఫోనుకు వెనకవైపున 0.3 మెగాపిక్సల్ కెమెరా ఉంది.

బ్లూటూత్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 4.2 వర్షన్ కూడా ఉంది. ఇందులో డ్యూయల్ సిమ్ 4జి సపోర్ట్ తో వస్తుంది. అంతేకాకుండా 3.5 mm హెడ్ ఫోన్ జాక్, మైక్రో USB పోర్టు కూడా ఈ ఫోన్లో ఉంది. ఇది రిమూవల్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ 6.5 గంటల టాక్ టైమ్ ఉంటుంది అని నోకియా కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ యొక్క మొత్తం బరువు 123g ఉంది.

మ్యూజిక్ ప్లేయర్ ఫీచర్లు, వైర్ లేస్ ఎఫ్ఎం ఈ 4G మొబైల్ లో ఉంది. నోకియా 2660 ఫ్లిప్ యొక్క ధర భారత్ లో సుమారు ₹4,699 ఉంటుంది. 48 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో బ్లూ, రెడ్, బ్లాక్, కలర్ ఆప్షనల్ లలో కూడా ఉంది. నోకియా వెబ్సైట్లో ఇప్పటికే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం జూలై నెలలో గ్లోబల్ గా విడుదలైన ఈ ఫోను ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది.