జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆదేశాలు

1975 సంవత్సరం నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు 2017 సంవత్సరంలో సవరణ చేస్తూ GSR 636-638 ఉత్తర్వులు వెళ్లడయ్యాయి వీటి అనుగుణంగా రాష్ట్రపతి కూడా GO 72,73 ఉత్తర్వులను వెల్లడిపరిచారు.

వీటిపై కొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా ఇంకా గౌరవ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈ పరిస్థితులలో కూడా ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టులను కేవలం ప్రభుత్వ యజమానులకు చెందిన ప్రధానోపాధ్యాయులు మాత్రమే నిర్ణయించడం కోర్టు ధిక్కరణతో పాటు తీవ్రమైన అన్యాయమని ఆప్టా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాకి ప్రకాష్ రావు, AGS గణపతి రావు అన్నారు.

Supreme Court

పైగా నిన్న ఇచ్చిన ఉత్తర్వులలో ఎయిడెడ్ పోస్టులలో నియామకమైన వారికి కూడా ఇంచార్జ్ MEO లుగా నియమించారని కావున హైకోర్టు లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేవరకు అధికారులు తీసుకున్న నిర్ణయాలను నిలపాలని ఉమ్మడి సీనియార్టీ ప్రకారం DIET/SCERT, MEO/DyEo అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి అని అన్నారు. ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం కోర్టు ధిక్కరణ కిందకు వచ్చేస్తుంది. కావున ఈ ఆదేశాలను వెంటనే ఆపాలని కోరారు