Password safety: పాస్వర్డ్ ని సేఫ్టీ గా ఉంచే విధానం

Password safety:ఈమెయిల్ ,ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్, ఆన్ లైన్ బ్యాంకింగ్,ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ఇలా ప్రతిదీ మన రోజువారి జీవితంలో ఒక భాగం అయ్యాయి. వీటిలో ఏదో ఒక సారీ వీటిని వాడని పరిస్థితికి వచ్చేసాం. వీటిని అన్నిటిని మెయింటైన్ చేయడానికి ఒక పాస్వర్డ్ మనకు చాలా అవసరం.

పాస్వర్డ్ ని సేఫ్టీ గా ఉంచే విధానం
పాస్వర్డ్ ని సేఫ్టీ గా ఉంచే విధానం.

ఒకటికి పదిసార్లు ఆన్లైన్ పేమెంట్స్ కి వాడటం దాని యొక్క పాస్వర్డ్లు గుర్తు తెచ్చుకోవడం మందికి తలనొప్పిగా మారుతుంది. దీంతో అన్నిటికీ ఒక్కటే పాస్వర్డ్ వాడుతున్నారు. ఇందులో నీ పేరు,ఇంటి పేరు మరియు పుట్టిన తేదీ,ముద్దుపేర్లు,సొంత ఊరు పేర్లు,స్కూల్ పేరు ఇలా వ్యక్తి గత సమాచారం ఆధారంగా పాస్వర్డ్ లు పెట్టుకోవడం పొరపాటుగా మారిపోయింది.

ఎవరికి తెలియకుండా పాస్వర్డ్ పెట్టుకోవడం చాలా మంచిది అని తెలియజేయడమైనది. కఠినంగా ఉంటే పాస్వర్డ్లు ఎవరు కూడా హ్యాక్ చేయడానికి చాలా కష్టపరితమవుతుంది.ఇప్పుడు సైబర్ హ్యాకర్లకు ఒక వరంగా మారిపోయింది. మనకు సంబంధించిన వ్యక్తిగత కొద్దిపాటి వివరాలు తెలిసినా మోసగాళ్లు వాటిని సులువుగా కనిపెడుతున్నారు.

పాస్వర్డ్ దొరికితే చాలు ఇక మన అకౌంట్లను హ్యాక్ చేసి కీలక సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అవకాశం దొరికితే చాలు బ్యాంక్ లను లూటి కూడా చేస్తున్నారు. వీలైనంతవరకు మనకు గుర్తు ఉండేలాగా కఠినంగా ఉండే పాస్వర్డ్ లను పెట్టుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు మనకు తెలియజేస్తున్నారు. మన వ్యక్తిగత ఖాతాలకు పాస్వర్డ్ పెట్టుకోవాలి అంటే కింది సూత్రాలను పాటించాలి అని తెలియజేశారు.

పాటించవలసిన సూత్రాలు…

పాస్వర్డ్ మనం తరచూ మారుస్తూనే ఉండాలి. పాస్వర్డ్ మరియు పిన్ నెంబర్లు ఎవరితోనూ షేర్ చేయకూడదు. వీలైనంతవరకు ఇతరులు ఊహించుకోవడానికి కూడా కఠినంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. కష్టంగా ఉండేటట్లు పాస్వర్డ్ చూసుకోవాలి.

మల్టీ ఫ్యాక్టర్ అతేంటికేషన్ (authection) ఈమెయిల్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఇతర సోషల్ మీడియా ఖాతాలకు పాస్వర్డ్ లతో పాటు ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయిన OTP వచ్చేలా సెట్టింగ్స్లో మార్చుకోవాలి.

పాస్వర్డ్ లో ఇంటిపేరు కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా చూసుకోవాలి. నాలుగు ఐదు అక్షరాలలో లేకుండా అంకెలు స్పెషల్ క్యారెక్టర్ లో పొడవైన పాస్వర్డ్ పెట్టుకోవడం మంచిది.

ఇలా ఉన్నట్లయితే హ్యాకర్లకు చాలా హ్యాక్ చేయడానికి కష్టంగా మారుతుంది . పైవన్నీ చెప్పిన సూత్రాలను పాటించవలెను. ఇలా చేస్తే మనకే చాలా మంచిది అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు మనకు తెలియజేశారు.