BJPTelangana

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర

HYD: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. 

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రను అనంతరం బిజెపి నాయకుడు బండి సంజయ్ ప్రారంభించారు. కార్యక్రమంలో BJP కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, , విజయశాంతి, డీకే అరుణ, తరుణ్ ఛుగ్, నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్, చార్మినార్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ గారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం ఆత్మస్థైర్యం, కల్పించే దిశగా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ (ఎంపీ) బండి సంజయ్ తెలిపారు. రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని మాట్లాడారు.

రాష్ట్ర సాధన కోసం1400 మంది బలిదానాలని చేశారని, వారి ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హాయంలో ఏ ఒక్క ఒర్గం కూడా ఆనందంగా లేదని వ్యాఖ్యానించారు. మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7,8 ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. 1 నిరుద్యోగికి కేసీఆర్ ప్రభుత్వం 1లక్ష రూపాయల చొప్పున బాకీ ఉందని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీలను CM KCR అటకెక్కించారని మండిపడ్డారు. 

ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చార్మినార్, మదీనా, బేగంబజార్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు యాత్ర చేరుకుంటుంది..గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు సంజయ్. అసెంబ్లీ ఉన్న మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే సమీపంలో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

అక్కడి నుండి మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం,లక్డీకాపూల్ మీదుగా పాదయాత్ర నిర్వహిస్తారు. 

మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు సంజయ్. కాగా, అంతకు ముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్… ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతలతో కలిసి చార్మినార్ చేరుకున్న సంజయ్… భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.రేపు సిటీలోనే బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.. రోజుకు 10 కిలోమీటర్లు నడుస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. 

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button