కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
క్రెడిట్ కార్డుల వాడకం గతంలో ఎన్నడు లేని విధంగా పెరిగింది. ఇటీవలే ఆర్.బీ.ఐ మే లో విడుదలు చేసిన గణాంకాలను పరిశీలిస్తే దేశంలో దాదాపు 7.7 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్యలో దాదాపు 23 శాతం పెరిగింది.
2018 తో పోలిస్తే దాదాపు 100% పెరిగింది.కార్డులే కాదు వీటి వినియోగ సైతం కూడా పెరిగింది. ఇదే సమయం లో కొత్త కార్డులను తీసుకుంటున్న వారు కూడా ఎంతగానో పెరిగారు. తొలిసారి కార్డును వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం.
కొత్త తరం సంస్థలు రుణాలను అందించడంలో దూకుడుగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ క్రెడిట్ కార్డుల స్థానం అవి భర్తీ చేయలేవు. క్రెడిట్ కార్డులను తీసుకోవాలని ఆలోచనతో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న కార్డులను ముందుగా పరిశీలించండి. ఏ బ్యాంకు మీకు కార్డు అందించేందుకు ముందు వచ్చింది. అది అందించే ప్రయోజనాలను తెలుసుకోండి.
మీ జీవనశైలికి ఏ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుందో చూసుకోండి. మీరు కూడా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే ఆ కొనుగోళ్లపై అధిక రివార్డులను ఇచ్చే కార్డులను కొనుగోలు చేయాలి. గృహోపకరణాలను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లులను ఈఎంఐ గా మార్చుకుంటే వడ్డీ లేకుండా ఈ వెసులుబాటు నిచ్చే కార్డు మీకు పనికొస్తుంది. ఇలా అవసరం ఏంటి, ఏ రకం కార్డు దానికి ఉత్తమం అనే కాస్త ఆలోచించి తీసుకోవడం చాలా ఉత్తమం.
రుణమేదైనా సరే దాని సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతది. కార్డు బిల్లులను నిర్ణీత గడువులోపు తీర్చడం మంచిది. కనీసం చెల్లింపు తోనే సరిపెట్టితే వడ్డీ భారం మోయాల్సి వస్తుంది. అదే చెల్లించకపోతే రుణములు భారీగా ఉంటాయి.
సాధారణంగా కార్డును వాడేది రివార్డు పాయింట్లు ఇతర తగ్గింపులు వస్తాయని, గడువులోపు చెల్లించకపోతే వడ్డీ రూపంలో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. భారంగా రుసములు మారుతాయి. బిల్లుకు నేరుగా చెల్లింపు జరిగేలా బ్యాంకు ఖాతాల నుంచి ఏర్పాటు చేసుకోండి.
క్రెడిట్ కార్డు పరిమితి లోపల ఎప్పుడూ 30 శాతానికి మించి ఉండకూడదు. తక్కువ ఖర్చు చేయడంవల్ల బిల్లు చెల్లింపుల ఇబ్బంది కూడా ఉండదు. రుణ వినియోగత నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు మెరుగవుతుంది. 750 పైన స్కోర్ ఉన్నప్పుడు కొత్త రుణాలు తీసుకోవడంపై మీకు సులభం అవుతుంది. నియంత్రణ లేకుండా ఖర్చు చేసి తర్వాత బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కరోనా వచ్చినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు ఎంతగానో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ కొనుగోలు చాలా పెరిగాయి మనకు తెలియకుండానే కార్డు తీసుకుంటున్న వారు, మన దగ్గర ఉన్న కార్డు తో లావాదేవీలు చేస్తున్నవారు చాలామంది పెరిగారు.
క్రెడిట్ కార్డ్ వాడకం విషయం ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దు. కార్డు సంఖ్య లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు చెప్పకూడదు. కార్డు ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. మీరు చేస్తున్న చెల్లింపులకు రెండు అంచెల భద్రత ఉండేలా ఏర్పాటు చేసుకోండి. కార్డును తీసుకోవడంతోనే సరిపోదు. దానికి సమయానికి చెల్లింపులు కూడా చేస్తూ ఉండాలి. భారం పడకుండా చూసుకోవడమే ముఖ్యమైన సూచన. అప్పుడే క్రెడిట్ కార్డు అందించే పూర్తి ప్రయోజనాలను మీరు సొంతం చేసుకుంటారు.