Puneeth RajKumar: కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి కన్నడ పవర్ స్టార్ గా పిలవబడే హీరో పునీత్ రాజ్ కుమార్. ఈయనకు ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుని అందిస్తున్నారు. 2021 అక్టోబర్ 29వ తేదీన ఈయన గుండెపోటుతో మరణించారు. నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ఇతరులు పాల్గొంటారు.
దివంగత నటుడికి అత్యున్నత పురస్కారం–
పునీత్ రాజ్ కుమార్, పార్వతమ్మ, రాజ్ కుమార్ దంపతుల నా కొడుకు. శక్తి, స్టార్ , అప్పు అనే పేర్లు ముద్దు పేర్లు. 45 సంవత్సరాల వయసులోనే అతని మరణం కన్నడ వాసులందరినీ ఒక శోకసంద్రంలో ముంచింది. చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
సినిమా రంగంలో పనిచేస్తూ కూడా మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడు. నిరుపేద పిల్లలకు విద్య అందించడం, పేదవారి పిల్లల చదువుకు సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాడు.
ఇతను చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని, ఇతను సాధించిన ఘనతను దృష్టిలో ఉంచుకొని అతనికి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అనే అవార్డును ఇవ్వాలని కొన్ని రాజకీయ పార్టీల నేతలు పట్టుబట్టారు. దీని అంగీకరిస్తూ కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న అవార్డుని ప్రధానం చేస్తున్నట్లు ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి బసవరాజ్ డాలి ప్రకటించారు.
కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1తేదీన ఈ అవార్డు అందిస్తున్నారు.–
కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం రోజున పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక రత్న అవార్డు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మి అక్టోబర్ 20న పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ అవార్డు ప్రధానోత్సవం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విధాన సౌధ ముందు మెట్ల మీద జరుగుతుంది.
ఈ అవార్డుని ముఖ్యమంత్రి బసవరాజు డాలి ,అశ్విని పునీత్ రాజుకు కర్ణాటక రత్న అవార్డుని అందజేస్తారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కాగేరి, ఎగువ సభ స్పీకర్ రఘునాథ్ మల్కాపూరే అలాగే గౌరవ అతిధులుగా నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.
అవార్డు ప్రదానోత్సవానికి విచ్చేసిన అధికారులు–
దేవాదాయ శాఖ మంత్రి ఆర్.అశోక్, కన్నడ అభివృద్ధి శాఖ మంత్రి సునీల్ కుమార్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, ఎగువ సభ ప్రతిపక్ష నేత పీకే హరి ప్రసాద్, ఎంపీ పీసి మోహన్, ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఇతరులు పాల్గొంటారు.
అశ్విని పునీత్ రాజ్ కుమార్ కి అధికారిక ఆహ్వానం–
ఈ వేడుక సందర్భంగా మంత్రులు ఆర్ అశోక్, సునీల్ కుమార్ సదాశివ నగర్ లోని పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భార్య అయిన అశ్విని పునీత్ రాజ్ కుమార్ కు అధికారిక ఆహ్వానం పలికారు. ఈయన సోదరులు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా హాజరయ్యారు.
అవార్డు ప్రధాన ఉత్సవానికి గంట ముందు సంగీత కచేరి, ఈ వేడుకకు 8000 మంది ప్రజెంట్ హాజరయ్యారు. 25 వేల మంది వస్తారని అంచనా. ఈ సంగీత కచేరిలో ఆయన నటించిన సినిమాలోని పాటలు ఉంటాయి. విధాన సౌధ ముందు అంబేద్కర్ రోడ్డులో ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు కర్ణాటక రత్న అవార్డు పొందిన వ్యక్తులు–
ఈ అవార్డు ప్రక్రియ 1992 నుంచి కర్ణాటకలో అమలవుతుంది. ఇప్పటివరకు ఈ అవార్డుని 9 మంది అందుకున్నారు. చనిపోయిన తర్వాత అందుకున్న పదవ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. 1–1992లో నె ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి జాతీయ కవి క్వేంబు.
2–1992లో రాజ్ కుమార్ కూడా ఈ అవార్డ్ పొందారు.
3–1999లో మాజీ ముఖ్యమంత్రి నిజ లింగప్ప 4–2000 సంవత్సరంలో శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు
5–2001లో డాక్టర్ దేవి శెట్టి
6–2005లో భీమ్సేన్ జోషి
7–2007లో దివంగత సిద్ధ గంగకు
రేవరెండ్ శివకుమార్ స్వామి,
8–2008లో రచయిత జవరే గౌడ
9– 2009లో ధర్మస్థల మంజునాథ ఆలయ అధ్యక్షుడు వీరేంద్ర హెగ్డే కు ఈ అవార్డు లభించింది.
10–పునీత్ రాజ్ కుమార్ కు ఈ అవార్డు లభించింది.
తండ్రి, కొడుకుల కర్ణాటక రత్న అవార్డు–
1992 సంవత్సరంలో పునీత్ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుని అందజేసింది. అదేవిధంగా ఈరోజు పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డు ని అందిస్తుంది. తండ్రి కొడుకులకు ఈ అవార్డు వచ్చింది. రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ల అభిమానుల్లో సంతోషం నెలకొంది. ఇది వారిద్దరికీ ఒక గొప్ప గౌరవం.
అవార్డుకు సంబంధించి–
కర్ణాటక రత్న అవార్డు గ్రహీతలకు వెండి పళ్ళెం, 50 గ్రాముల బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేస్తారు.