రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చనిపోవడానికి గల కారణాలు. ఇండియాలో స్టార్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించారని ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రి డాక్టర్స్ తెలిపారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడ్డాడు మరియు డయాలసిస్ కూడా చేయించుకునేవారు. ఈయనకు డయాబెటిస్ కూడా ఉంది. యాంజియో ప్లాస్టీ కూడా చేయించుకున్నారు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా (1960-2022). రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇండియాలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడుదారుడు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖ ఝున్‌ఝున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. ఇతని తండ్రి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేశారు. ఇతను మంచి ఇన్వెస్టర్, ట్రేడర్, ఛార్టర్డ్ అకౌంటెంట్.
స్టార్ మార్కెట్లో కేవలం 5000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించారు. 37 ఏళ్లకే 30 వేల కోట్ల పెట్టుబడులతో రికార్డు సృష్టించగలిగాడు. 11వేల కోట్లు టైటాన్ లో పెట్టుబడి పెట్టాడు. ఇతనికి అరబిందో ఫార్మా, లూపిన్, విఐపి ఇండస్ట్రీస్, ఫోర్టీస్ హెల్త్ కేర్ వంటి కంపెనీలలో పెట్టుబడులు కలవు. ఆకాస ఎయిర్ లైన్స్ కూడా ప్రారంభించాడు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు.
ఫోర్టీస్ హెల్త్ కార్లో 900 కోట్లు, క్రిసీల్లో 1300 కోట్లు, టాటా మోటార్స్ లో 1700 కోట్లు, స్టార్ హెల్త్ లో 7 వేల కోట్లు, టైటాన్ కంపెనీలో 11 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొదటగా టైటాన్ కంపెనీలో 24 కోట్ల పెట్టుబడి పెట్టగా ప్రస్తుతం 11 వేల కోట్లకు చేరింది. మొత్తం 32 కంపెనీలలో ఇతనికి షేర్లు కలవు.