రిషి సునక్ బ్రిటన్ దేశ రాజకీయ మరియు వ్యాపారవేత్త. ఈయన తాజాగా బ్రిటన్ అధ్యక్షత ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు. ఈయన 12 మే 1980లో సౌత్తాఫ్టన్ లో జన్మించారు. తండ్రి ఎస్వీర్, తల్లి ఉష వీరు భారతీయులు కనుక రిషి సునక్ కూడా భారతీయుడని చెప్పవచ్చు. వీరు 1960 లో U K కు వలస వెళ్లారు.బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడంతో ప్రధాని పదవి కోసం బ్రిటన్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రధాని పదవి కోసం తొమ్మిది మంది ఎంపీలు పోటీ పడుతున్నారు ఈ పోటీల్లో రిషి సునక్ తో పాటు భారతీయ సంతతికి చెందిన సుయెల్ల బ్రేవర్ మెన్ కూడా పోటీ చేస్తున్నాడు. ఈ తొమ్మిది మందిలో వారిలో వారికే పోటీ నిర్వహించి తుది జాబితాగా ఇద్దరిని ఎంపిక చేసుకుంటారు. మాజీ మాజీ రక్షణ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసి తన మద్దతును కూడా రిషి సునక్ కు ప్రకటించడంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ జాబితాలో రిషి సునక్, లిజ్ ట్రస్ తుది జాబితా గా నిలిచారు. ఫైనల్ గ్రౌండ్లో 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లు ఓటింగ్లో పాల్గొని ఇద్దరిలో ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ ఐదు నాటికి పూర్తవుతుంది. బ్రిటిష్ కథనాల ప్రకారం రిసీ సునక్ ప్రధానిగా గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి.
రిషి సునక్ నేపథ్యం:
స్వతంత్ర బోర్డింగ్ స్కూల్ అయినా వించేస్టర్ కాలేజీలో చదివాడు. అక్కడ ఈయన హెడ్బాయ్ గాను, స్కూల్ పేపర్ ఎడిటర్ గా కూడా పనిచేశాడు. వేసవి సెలవుల్లో సొంత ఊరిలో కర్రీ హౌస్ లో వెయిటర్ గా కూడా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ లోని లింకన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్ అంది ఎకనామిక్స్ (P P E) చేశాడు. 2001లో మొదటి గ్రాడ్యుయేట్ అయ్యాడు.2001లో తన తల్లిదండ్రులతో కలిసి బిబిసి డాక్యుమెంటరీ కోసం ఇంటర్వ్యూ చేయబడ్డాడు. 2006లో స్టాన్ ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశాడు.
ఎంబీఏ చదివేటప్పుడు అక్షతా మూర్తిని కలిశాడు. ఆమె భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త నారాయణమూర్తి కుమార్తె. ఈయన బ్రిటిష్ లో 22వ అత్యంత ధనికుడు. (2022 నేటికీ 730 మిలియన్ల సంపాదన). క్రమంగా తనని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
2015 లో జరిగిన ఎన్నికల్లో తెరిసా మే యొక్క రెండవ ప్రభుత్వంలో పార్లమెంటరీ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పని చేశారు.
మే రాజీనామా తర్వాత బోరిస్ జాన్సన్ కు మద్దతుగా ఉన్నారు. జాన్సన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత సునక్ ట్రెజరీకిప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డాడు. 2018లో ప్రభుత్వ మంత్రిగా కూడా పనిచేశాడు. 2020లో సాజిద్ జావిద్ ఛాన్స్లర్ ఆఫ్ ది ఎక్స్చేంజర్ గా మారాడు. 5 జులై 22న ఈ పదవికి రాజీనామా చేశాడు. తర్వాత కొన్ని కారణాలవల్ల జాన్సన్ కూడా రాజీనామా చేశారు.
8 జులై 2022న conservating పార్టీ నాయకత్వ ఎన్నికల్లో జాన్సన్ స్థానంలో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు.
మా అమ్మ నడిపే కెమిస్ట్ షాప్ లో పనిచేయడం నుండి, పెద్ద వ్యాపారాలను నిర్మించడం వరకు ఎంతగానో అనుభవం ఉందన్నారు. ప్రజల భవిష్యత్తుకు, శ్రేయసుకు రాజకీయ నాయకులు ఉచిత సంస్థలకు, ఆవిష్కరణలకు ఎలా మద్దతు ఇవ్వాలో అనుభవం ద్వారా తెలుసుకున్నాను అన్నారు. తాను పాఠశాల గవర్నర్గా యూత్ క్లబ్లో బోర్డు మెంబర్ గా ఉన్నానని తెలిపారు. నా విలువైన సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తానని తెలిపారు ప్రభుత్వం నుండి ఖజానాకు క్యాన్సిలర్ గా నియమింపబడే గౌరవం నాకు లభించింది .కనుక ఈ పదవి ఈ పదవిని నిర్వర్తించడానికి నాకు అధికారం ఉందని తెలిపారు. ప్రజలు తన యొక్క విలువైన ఓటును వేసి గెలిపించమని చెప్పుకొచ్చారు.