Royal Enfield Electric Bikeరాయల్ ఎన్ఫీల్డ్ బైక్ భారత దేశంలో చాలా డిమాండ్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనాలకు సమాజంలో ప్రసిద్ధి చెందింది. అయితే ఇందులో కూడా ఎలక్ట్రిక్ వేరియన్స్ రాబోతున్నాయట. రోడ్డుమీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ బైక్ నుండి వచ్చే డుగ్గు డుగ్గు అనే శబ్దం అందరిని ఆకర్షిస్తుంది.
అదే బుల్లెట్ బండి ఇలాంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా దూసుకుపోతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భవిష్యత్తులో నిశ్శబ్దంగా దూసుకెళ్లే బుల్లెట్ బైకులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
రాయల్ ఎన్ ఎలక్ట్రిక్ బుల్లెట్ రాపోతుందని గత రెండు మూడేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి ప్రకటన లేదు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక వాహనాల ట్రెండ్ నడుస్తుండడంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలే మార్కెట్లో ఉండే అవకాశం కూడా ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ ఎడిషన్ లో అయినా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోడల్ ను తీసుకురావాలని కంపెనీ ఆలోచన ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. 2025 సంవత్సరం ద్వితీయార్థంలో లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
మరి భవిష్యత్తులో వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా అది ఎన్ని కిలోమీటర్లు రేంజ్ అందివ్వగలదు అని అంశాల పైన కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మోటార్ కెపాసిటీ కూడా పెట్రోల్ బైక్ మోడల్ లో ఉన్నట్లుగా 350 సీసీ నుండి 650 సీసీ వరకు సమానమైన మోటార్ సామర్థ్యాన్ని ఉంచుతారు.
శక్తివంతమైన టార్కుతో ఎలక్ట్రిక్ వర్షన్ కూడా అదే మొత్తంలో పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉండవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా లాంగ్ రేంజ్ అందించే సౌకర్యవంతమైన బైకుగా ఉంటుంది.
ఇందులో శక్తివంతమైన 10 కిలో వాట్స్ బ్యాటరీ పొందుపరిచారు. దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఇది ఫుల్ చార్జ్ చేయటానికి సుమారుగా 8 నుండి 10 గంటల సమయం పడుతుంది అని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ ను ఐచర్ మోటార్స్ కంపెనీ తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ బుల్లెట్ ఊహగానాల నేపథ్యంలో కంపెనీ వర్గాలు ఒక ఏజెన్సీ తో మాట్లాడుతూ హై ఎండ్ ఎలక్ట్రిక్ టూవీలర్ మోడల్స్ పై కస్టమర్లు అంచనాలను ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Hero Splendor electric bike https://telugu.thefinexpress.com/hero-splendor-electric-bike-launch-date-and-price/
Hero Splendor Electric Bike: Launch Date, Specifications and Price https://telugu.thefinexpress.com/web-stories/hero-splender-pluse-eletric-bike-lanuch-date-specifications-and-price/q