SBI వడ్డీరేట్లు పెంపు

SBI వడ్డీరేట్లు పెంపు

MCLR 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ రుణ గ్రహీతలకు మరోసారి షాక్ ఇచ్చింది. MCLR తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు సవరించింది. జూలై 15 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను పెంచింది.

బ్యాంకు వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు సంవత్సరం కాలపరిమితి కలిగిన రుణాలపై MCLR 7.40% నుంచి 7.50% మార్పు చేసింది. ఒక్కరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై MCLR ని కూడా పెంచింది.

RBI వడ్డీ రేట్లను పెంచిన నాటి నుంచి ఎస్బిఐ MCLR ను క్రమంగా పెంచుతూ వస్తుంది. గత నెలలోనూ MCLR ని 20 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండిగ్ రేట్ ను కూడా సవరించింది.

ఎస్బిఐ MCLR శాతం

కాలపరిమితి పాతది కొత్తది
ఒక్కరోజు 7.05 7.15
ఒక నెల 7.05 7.15
మూడు నెలలు 7.05 7.15
ఆరు నెలలు 7.35 7.45
ఏడాది 7.40 7.50
రెండేళ్లు 7.60 7.70
మూడేళ్లు 7.70 7.80