T20 World Cup 2022: చావో రేవో గెలిచి తీరాల్సిన స్థితికి చేరుకున్న శ్రీలంక.
క్రికెట్ ఆటకు సంబంధించి టి20 ప్రపంచ కప్ పోటీ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం జట్లన్నీ ఆస్ట్రేలియా వేదికన పోటీ పడనున్నాయి. దీంట్లో భాగంగా ప్రపంచ కప్ కు సంబంధించిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి చివరికి ప్రపంచకప్ ను ఎవరు సొంతం చేసుకున్నారనేది ప్రస్తుతం అందరికీ తెలియాల్సిన విషయం.
క్రికెట్ అభిమానులైతే పండగలాగ ఈ ప్రపంచ కప్ మ్యాచ్ల్ని ఎంజాయ్ చేస్తూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంట్లో భాగంగా టి20 ప్రపంచ కప్ 2020 మ్యాచ్లు ఎవరి అంచనాలకు అందట్లేదు. ఈ ప్రపంచకప్ పోటీ అనేది అన్ని దేశాల మధ్య ఊహించని ట్విస్ట్ లతో మొదలవుతుంది.
దీనికి సంబంధించి తొలి రెండు రోజుల్లో జరిగిన మ్యాచుల్లో కూడా సంచలనాలు నమోదయ్యాయి. టి20 ప్రపంచ కప్ 2020 టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్ లోనే నమీబియా చేతుల్లో శ్రీలంక గోరంగా ఓడిపోవడం జరిగింది. తర్వాత రోజు జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ చేతుల్లో వెస్టిండీస్ ఓడిపోవడం జరిగింది. అదే సమయంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వామప్ మ్యాచ్లో సైతం నరాలు తెగే ఉక్కంటతో సాగింది. ఇది క్రికెట్ అభిమానులకు ఒక పండగ లాంటిది. ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా అలాంటి పరిణామాలే జరిగే అవకాశం కూడా ఉంది.
ఈ వరల్డ్ కప్ గ్రూప్ ఏ లో భాగంగా శ్రీలంక తన రెండవ మ్యాచ్ ఆడబోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పోటీ పడనుంది. ఈరోజు మధ్యాహ్నం 1. 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మెల్బోర్న్ గిలాంగులోని సైమాండ్స్ స్టేడియం దీనికి వేదిక కాబోతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతుంది. మొదటి రౌండు ముగిసిన తర్వాత గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో నమీబియా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది. అత్త అడుగు స్థానానికి దిగజారిన శ్రీలంక.
శ్రీలంకకు ఇది డూ ఆర్ డై మ్యాచ్, చావు రేవు తేల్చుకోవాల్సిన విషయం. మొదటి మ్యాచ్ లోనే నమీబియా తో ఓడిపోవడం ద్వారా శ్రీలంక షాక్కు గురైంది. ఇలాంటి ప్రమాదానికి లోనవుతుంది. దీని కారణంగా కచ్చితంగా ఈ మ్యాచ్ శ్రీలంక గెలవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఆడబోతున్న ఈరోజు మ్యాచ్ అనేది ఏ విధంగా జరుగుతుందో అని ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ను ఎంతో ఆసక్తికరంగా మార్చడం ఖాయంగా అనిపిస్తుంది. టి20 ప్రపంచ కప్ కు సంబంధించి కొత్తగా వచ్చిన యూఏఈ నీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన సరే తర్వాత తన ఆట తీరును ఎంతో బాగా ప్రదర్శించింది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న నెదర్లాండ్ను కూడా ఈ యూఏఈ అడ్డుకోగలిగింది. మ్యాచ్ను చివరి బంతి వరకు తీసుకెళ్లగలిగింది. చేసింది 111 పరుగులే అయినా దీన్ని కాపాడుకోవడానికి యూఏఈ బౌలర్లు తెగింపును ప్రదర్శించారు.
తమ మ్యాచ్ని చివరి వరకు తీసుకెళ్లగలిగారు అంటే వాళ్ళ బౌలింగ్ స్కిల్స్ అనేవి ఎంత మేరకు అభివృద్ధి చెందాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక తుది జట్టులో-పాథుమ్ ని శంక్క, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), ధనుంజయ డిసిల్వా, దాసన్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దిల్షన్ మధు శంక, ధనుష్క గుణ తిలక, భానుక రాజపక్స, మహీశ్ తీ క్షణ, దుశ్వంత చమీరా ఆడే అవకాశం ఉంది.
యూఏఈ లో ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, వృత్య అరవింద్ (వికెట్ కీపర్), సిపి రిజ్వాన్ (కెప్టెన్), చిరాగ్ సూరి, వసీం మహమ్మద్, అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మె యప్పన్, జహూర్ ఖాన్, జునైద్ సిద్ధిక్, బాసిల్ హమీద్ కూడా ఆడవచ్చు. ఈరోజు జరిగే ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠతో ఉండబోతుంది. శ్రీలంక ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలని అనుకుంటుంది.