Cricket

T20 world cup: ఐర్లాండ్ పై ఓటమితో ఇంటిదారి పట్టిన వెస్టిండీస్.

Westindies:2022 టి20 వరల్డ్ కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతుంది. క్వాలిఫై మ్యాచ్ లలో చిన్న జట్లు మాజీ ఛాంపియన్లను మట్టి కల్పిస్తున్నాయి. మొదట శ్రీలంకను, నమీబియా ఓడించి సంచలనాలను ప్రారంభించింది. నేడు ఐర్లాండ్ అద్భుతమైన ఆటతీరుతో రెండుసార్లు t20 ఛాంపియన్ అయినా వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో గెలిచి, సూపర్ 12 కు ఎంపిక అయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ Brodonking 48 బంతుల్లో 62 పరుగులు చేశాడు. జాన్సన్ చార్లెస్ 18 బంతుల్లో 24, ఒడన్ స్మిత్ 12 బంతుల్లో 19 పరుగులు చేశాడు. వీరు తప్ప మిగతా బ్యాట్స్ మెన్స్ గోరంగావిఫలమయ్యారు.

ఐర్లాండ్ బౌలర్లలో Garethdelany 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి, మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ఇతని దాటికి వెస్టిండీస్ కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Westindies vs Ireland

             అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ ఏమాత్రం తడబడకుండా లక్ష్యాన్ని అధిగమించింది. కేవలం 17.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, 150 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఓపెనర్ Pstiring 48 బంతుల్లో 66 పరుగులతో, మరో ఓపెనర్ Balbirnie 23 బంతుల్లో 37 పరుగులు చేసి ఐర్లాండ్ విజయానికి బాటలు వేశారు.

ఐర్లాండ్ కెప్టెన్ అవుట్ అయిన అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన Cutker 35 బంతుల్లో 45 పరుగులు చేసి ఐర్లాండ్ కు విజయాన్ని సాధించాడు. ఐర్లాండ్ బ్యాట్స్మెన్  పై వెస్టిండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే  కోల్పోయి, ఐర్లాండ్ 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించడంతోపాటు, సూపర్ 12 కు ఎంపికయింది.

ఈ ఓటమితో మాజీ ఛాంపియన్ అయినా వెస్టిండీస్ క్వాలిఫై కాకుండా ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్ ప్రదర్శించిన ఐర్లాండ్ బౌలర్ Garethdelany కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.

  1. టి20 వరల్డ్ కప్ లో రెండుసార్లు ట్రోఫీని గెలుచుకున్న వెస్టిండీస్ ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది.
  2. వరల్డ్ కప్ గెలిచి టోర్నమెంట్ కు అర్హత సాధించలేకపోయినా జట్టుగా వెస్టిండీస్ ముద్రను వేసుకుంది.
  3. క్రిస్ గేల్, రసేల్, సునీల్ నరైన్, హిట్ మేర్, బ్రావో లాంటి స్టార్ ప్లేయర్లు ఈ జట్టులో లేకపోవడంతో వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉంది.
  4. 2012లో మొదటిసారిగా వెస్టిండీస్ టి20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది.
  5. 2016లో చివరి ఓవర్లో 4 బంతుల్లో నాలుగు సిక్సులు కొట్టి రెండవసారి వెస్టిండీస్ విశ్వ విజేతగా నిలిచింది.
  6. 2009, 2014 వరల్డ్ కప్ లో కూడా వెస్టిండీస్ మంచి ప్రదర్శన చేసి సెమీఫైనల్స్ వరకు చేరింది.
  7. 2007లో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి                  పట్టింది. 
  8.  2022లోకూడా క్వాలిఫై కాకుండా ఇంటిదారి పట్టడంతో, వెస్టిండీస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button