T20 World Cup 2022: #IND vs PAK: నోబాల్ వివాదం- కోహ్లీ వల్లే అంటున్న పాక్ ఫాన్స్
T20 World Cup 2022: #IND vs PAK: నోబాల్ వివాదం- కోహ్లీ వల్లే అంటున్న పాక్ ఫాన్స్. క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం జట్లన్నీ ఆస్ట్రేలియా వేదికన పోటీ పడనున్నాయి. దీనికి సంబంధించి సూపర్ 12 జట్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు టీమిండియా జట్టు తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో తలపడింది.
పాకిస్తాన్ జట్టుపై టీమిండియా జట్టు విజయం సాధించింది. దీంట్లో భాగంగా విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఒంటి చేత్తో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. గెలిపించాడు కూడా. ఈరోజు జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చేసిన ప్రదర్శనకు సంబంధించి కొన్ని వివాదాలు బయటికి రావడం జరిగింది. అవేంటంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆఖరి ఓవర్ నాలుగో బంతికి విరాట్ సిక్స్ కొట్టాడు. బంతి నడుం కంటే ఎత్తుగా రావడంతో విరాట్ నో బాల్ కోరడం జరిగింది.
అబ్బాయి నో బాల్ గా ఇచ్చాడు. అయితే అది నోబాల్ కాదు అని, కోహ్లీ అడగడంతోనే నోబాల్ ఇచ్చారని, కనీసం రివ్యూ కూడా ఇవ్వలేదని పాక్ ఫాన్స్ మండిపడుతున్నారు. ఫ్రీ హిట్టుకు కోహ్లీ బౌల్డ్ అయ్యాక అది డెడ్ బాల్ అవుతుందని అంటున్నారు. భారత్ ,పాకిస్తాన్ మ్యాచ్లో నో బాల్ వివాదం. కోహ్లీ అడిగినందుని నోబాల్ ఇచ్చారని అంటున్న పాక్ ఫ్యాన్స్. ఫ్రీ హిట్టుకు బౌల్డ్ అయితే డెడ్ బాల్ గా ప్రకటించాలంటు న్న పాక్ ఫ్యాన్స్.
పాకిస్తాన్ తో జరిగిన వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ ఆఖరిలో అనుకోని విధంగా పరుగులు తీసి విన్నయింది. లాస్ట్ ఓవర్లో టీమిండియా జట్టుకి 16 పరుగులు అవసరం కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజ మ్, స్పిన్నర్ నవాజ్ చేతికి బంతిని ఇచ్చాడు. మొదటి బంతికే హార్దిక్ అవుట్ కాగా, రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీశాడు. మూడో బంతికి రెండు పరుగులు తీశాడు కోహ్లీ, నాలుగో బంతిని సిక్స్ గా మలిచాడు. కానీ బంతి నడుం కంటే ఎత్తుగా రావడంతో నోబిల్ కోరాడు కోహ్లీ. దీంతో అంపైర్ నో బాల్ ఇచ్చాడు.
దాని తర్వాత వేసిన బంతి ఫ్రీ హిట్ కాగా, నవాజ్ వైడ్ వేశాడు. తర్వాత బంతికి విరాట్ కోహ్లీ బౌల్డ్ అయినప్పటికీ, అది ఫ్రీ హిట్ కావడంతో విరాట్ కోహ్లీ , కార్తీక్ 3 పరుగులు తీశారు. నెక్స్ట్ బంతికి కార్తీక్ కాగా, చివరి బంతిని నవాజ్ వైడ్ వేశాడు. దీంతో స్కోర్ సమానమయ్యాయి. ఆఖరిబందిని మిడ్ ఆఫ్ మీదుగా గాల్లోకి లేపిన అశ్విన్ సింగిల్ తీయడంతో విజయం సాధించిన ది ఇండియా జట్టు.
ఇది ఇలా ఉండగా కోహ్లీ అడగ్గానే నో బాల్ ఇలా ఇస్తారని కాకు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. విరాట్ క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు కాబట్టి అది మోబాల్ ఎలా అవుతుంది ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఎంపైర్లను ప్రశ్నించాడు. ఫ్రీ హీ ట్ బంతికి కోహ్లీ బౌ ల్డ్ అయ్యాక అది డెడ్ బాల్ ఎందుకు అని ప్రశ్నించారు.
ట్వీట్ట్ చేశారు. అంపైర్ లు భారత్ కి అనుకూలంగా ఉన్నారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నా సీర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. కానీ ఐసీసీ, బీసీసీఐని అప్సెట్ చేయొద్దని ఈ కారణంతోనే మనం సైలెంట్ గా ఉందాం అంటూ సెటైర్లు వేశారు. ఈరోజు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై టీమిండియా జట్టు విజయం సాధించింది.