వర్షం కారణంగా న్యూజిలాండ్ vs ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ రద్దు.
వర్షం కారణంగా న్యూజిలాండ్ vs ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ రద్దు. క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ జట్టులు ఆస్ట్రేలియా వేదికన ప్రపంచ కప్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. దీనికి సంబంధించి సూపర్ 12జట్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. కొన్ని మ్యాచ్లు ఇప్పటివరకు విజయవంతంగా జరిగి ఎవరో ఒకరు విజయాన్ని సొంతం చేసుకుంటూ వెళుతున్నారు.
మరికొందరు వర్షం కారణంగా మ్యాచులు రద్దీ బాధపడుతున్నారు. దీనికి సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. సూపర్ 12 గ్రూప్ వన్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ఈరోజు అంటే అక్టోబర్ 26 జరగాల్సి ఉండగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఈరోజు ఎట్లా అభిమానులు నిరాశపడుతున్నారు. బాధకు గురవుతున్నారు.
ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ను చిత్తు చేసి జోరు మీద ఉన్న విలియంసన్ సేన ఈరోజు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతుంది. ఈ మ్యాచ్ రద్దు అవడం వల్ల దీని ప్రభావం ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాల మీద పడుతుందని ఆ జట్టు భావిస్తుంది.
గత రికార్డులన్నీ బ్రేక్ చేసిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అత్యధిక టిఆర్పి రేటింగ్స్.
ఇంకోవైపు తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా ఈ మ్యాచ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాలని ప్రిపేర్ కావడం జరిగింది. తమ అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించి సంచలనం నమోదు చేయాలని నబి సేన భావించింది. వారి ఆశలు కూడా నిరాశలయ్యాయి. ప్రారంభం కాకుండానే వర్షం కారణంగా రద్దు కావడంతో చాలా బాగా పడుతున్నారు ఈ రెండు జట్ల అభిమానులు. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల రెండు జట్లు చెరువు పాయింట్ తీసుకొని సర్దుకున్నాయి.
ఇది ఇలా ఉండగా ప్రస్తుత ప్రపంచ కప్ గ్రూప్ 2 లోభాగంగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య కూడా ఇలాగే ఫలితం తేలకుండా రద్దయింది. అయితే ఈ మ్యాచ్ కొద్దిగా ఓవర్ల పాటు సాగింది. ఒక ఓవర్ ఆట ఆడే అవకాశం దొరికింటే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విన్ అయ్యేది.
అయితే ఈరోజు జరిగిన మరొక మ్యాచ్కు కూడా వర్షం కారణంగా రద్దు కావడం జరిగింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో సాధించి సంచలనం సృష్టించింది. అయితే వర్షం కారణంగా కొన్ని జట్లు నష్టపోవడం జరిగింది. భావం సెమిస్కు చేరే అవకాశాలను తగ్గించే అవకాశం ఉంది.