Sports News

KL Rahul Marriage: పెళ్లి దుస్తులు ఖరారు చేసిన అతీయాశెట్టి

KL Rahul Marriage: క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ ముగిసింది. 2022 సంవత్సరంలో వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం జట్లన్నీ కూడా ద్వైపాక్షిగా సిరిస్ పై దృష్టిపెట్టాయి. దీంట్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టి20 లు ఆడనున్నాయి. ఈ క్రమంలో టీమిండియా జట్టు న్యూజిలాండ్తో నవంబర్ 18 వ తారీఖున తలపడింది.

ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కె.ఎల్ రాహుల్ వివాహానికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి.

పెళ్లి దుస్తులు ఖరారు చేసిన కేఎల్ రాహుల్ అతీయాశెట్టి
పెళ్లి దుస్తులు ఖరారు చేసిన కేఎల్ రాహుల్ అతీయాశెట్టి

ఇదిలా ఉంటే కేల్ రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని తెలుసుకోవడానికి అతని అభిమానులు నెట్ ఇంట్లో తెగ వెతికేస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరంటే బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గారి కూతురు అతియ శెట్టి నీ వివాహం చేసుకోబోతున్నాడు.

అయితే వీళ్ళిద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తెలిసింది. చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. ప్రస్తుతం విరు వివాహం చేసుకోబోతున్నట్లు తెలిసింది. ఇలా ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో వివాహం చేసుకుంటున్నారు.

త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని 2023లో జనవరిలో విరు వివాహం జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన దుస్తులను కూడా ఖరారు చేశారని సమాచారం. వీరి వివాహానికి సంబంధించిన అన్ని పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని తెలిసింది.

ముందుగా ఖండాల మాన్షన్ లో వీరి వివాహానికి సంబంధించిన దుస్తులు ఖరారు చేశారని తెలిసింది.రాహుల్ బుధవారం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్లిస్వామిని దర్శించుకున్నారు. సౌత్ ఇండియా కు సంబంధించిన సాంప్రదాయాల ప్రకారం గా వీరు వివాహం చేసుకోబోతున్నారు.అథియాకు ఇష్టమైన డిజైనర్ మనీష్ మల్హోత్రా. మరి వీరి పెద్ద రోజు నా ధరించే దుస్తులను కూడా ఖరారు చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button