Chess World Champion 2022: చెస్ వరల్డ్ ఛాంపియన్ ను ఓడించిన భారత గ్రాండ్ మాస్టర్లు-ప్రజ్ఞానంద్, అర్జున్ ఇరగైసి
Chess World Champion 2022: ప్రస్తుతం క్రీడలకు సంబంధించి జరుగుతున్న పోటీలలో చెస్ కు సంబంధించిన పోటీలు కూడా జరుగుతు న్నాయి ఇది మెదడుతో ఆడే ఆట. బాగా ఆలోచించి మెదడుకు పని పెట్టి ఆడాల్సిన ఆట. దీని ద్వారా పిల్లలకు తెలివితేటలు పెరగడమే కాకుండా ఎత్తుకు పై ఎత్తు వేసే విధానం గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటాడు.
అలాగే క్రీడా స్ఫూర్తి అనేది కూడా తెలుస్తుంది. మెదడుకు మేత వేసే ఆటలకు సంబంధించి ఇది ఒకటి. దీనికి సంబంధించి చెస్ వరల్డ్ ఛాంపియన్ గా పేరుగాంచిన మాగ్నస్ కార్లు సన్ ను 19 ఏళ్ల అర్జున్ ఇర గైసి ఓడించాడు. దీనికి సంబంధించి మాగ్నస్ కార్లు సన్ వరుసగా భారత గ్రాండ్ మాస్టర్ ల చేతుల్లో ఓటమిపాలవుతున్నారు. ప్రజ్ఞానంద్ ఇటీవల కాలంలోనే మూడుసార్లు కార్ల్ సన్ ను ఓడించాడు.
ప్రస్తుతం చెస్ కు సంబంధించిన జరుగుతున్న పోటీలలో తాజాగా ఏయిమ్ చెస్ టోర్నీలో 19 ఏళ్ల అర్జున్ ఇరగైసి విజయం సాధించాడు. 54 ఎత్తులోనే కార్లు సన్ కథ ముగించాడు. చెస్ లో రారాజుగా పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి, నార్వే దేశానికి సంబంధించిన ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ అయినా మాగ్నస్ కార్ల సన్ ఇటీవల భారత గ్రాండ్ మాస్టర్లు చేత ఓడిపోతున్నాడు. 17 ఏళ్ల వయసున్న ప్రజ్ఞానంద్ అనే యువ గ్రాండ్ మాస్టర్ నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు మాగ్నస్ కార్ల సన్ ను ఓడించి చెస్ కు సంబంధించి చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం జరిగిన మ్యాచ్ లో అర్జున్ ఇరగైసి అనే 19 గ్రాండ్ మాస్టర్ కార్లు సన్ ను చిత్తు .ఎయిమ్ చెస్ రాపిడ్ ఆన్లైన్ టోర్నీలో 19 ఏళ్ల అర్జున్ ఇరగైసి ఏడో రౌండ్లో కార్ల సన్ పై గెలిచాడు. 54 ఎత్తులో ఇతని ఆట కట్టించాడు. గత నెలలోనే అర్జున్ ఇరగైసి జూలీ య్ బేయర్ జనరేషన్ కప్ ఆన్లైన్ టోర్నీలో కార్లు సన్ చేతుల్లో ఓటమిపాలయ్యాడు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు గెలిచి చూపించారు. కార్ల సన్ కి ప్రతీకారం తీర్చుకున్నాడు.
వరల్డ్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల సన్ పై గెలవడం అర్జున్కి ఇదే మొదటిసారి.