CricketPakistan

NZ vs PAK T20 WC:న్యూజిలాండ్ పై పాకిస్తాన్ ఘనవిజయం

NZ vs PAK T20 WC: t20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ గ్రూప్ -1కి జరిగింది. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో, సిడ్నీ లో జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ జట్టు బౌలింగ్ చేస్తుంది.

న్యూజిలాండ్ జట్టుకు ప్లేయర్స్–

(ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

పాకిస్థాన్ జట్టుకు ప్లేయర్స్–

(ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.

న్యూజిలాండ్ పై పాకిస్తాన్ ఘనవిజయం
న్యూజిలాండ్ పై పాకిస్తాన్ ఘనవిజయం

షాహిన్ బౌలింగ్లో ఫిన్ అలెన్ మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేసి 0.3 ఓవర్ లో అవుట్ అయ్యాడు.హారీస్ రవూఫ్ బౌలింగ్లో డేవాన్ కాన్వే 20 బంతుల్లో 21 పరుగులు చేసి పవర్ ప్లే లో ఆఖరి బాలులో ఔట్ అయ్యాడు.మహ్మద్ నవాజ్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వంతుల్లో ఆరు పరుగులు చేసి 8.0 ఓవర్లులో అవుట్ అయ్యాడు.

షాహీన్ అఫ్రిది బౌలింగ్లో కేన్ విలియమ్సన్(c) 42 బంతుల్లో 46 పరుగులు చూసి 16.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేసిన తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో 152/4 స్కోర్ చేశారు. పాకిస్తాన్ జట్టుకి 153 పరుగులు టార్గెట్గా ఇచ్చింది న్యూజిలాండ్. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుంది.

https://twitter.com/dekheeenjiii/status/1590309220905549825?t=qOg3ArJ8XruY5CFqPOsGWA&s=19

ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో బాబర్ ఆజాం 42 బంతుల్లో 53 పరుగులు చేసి 12 .4 ఓవర్ లో అవుట్ అయ్యాడు. రిజ్వాన్ 43 బాల్స్ లో 57 పరుగులు చేసి 17వ ఓవర్ లొ అవుట్ అయ్యాడు. హరీష్ 26 బంతుల్లో 30 పరుగులు చేసి 19.0 ఓవర్లులో అవుట్ అయ్యాడు.

7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి పాకిస్తాన్ జట్టు ఫైనల్ కి వెళ్లారు. 153/3 స్కోరు చేసింది పాకిస్తాన్ జట్టు. లాస్ట్ ఓవర్ లో ఐదు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ని అందుకొని ఫైనల్ కి చేరిపోయారు పాకిస్తాన్. న్యూజిలాండ్ పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button