Rahul Dravid: కోచ్ ద్రవిడ్-ఆస్ట్రేలియాకు రావాలని ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ కు పిలుపు
టీమిండియా కు సంబంధించి స్టార్ బౌలర్ గా పిలువబడే బూమ్రా గాయాల కారణంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నారు. మరి ఇతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లలో ఎవర్నో ఒకరిని బూమ్రా స్థానంలోకి తీసుకునే అవకాశం ఉంది. స్పీడు స్టార్, జమ్మూ ఎక్స్ప్రెస్ గా ఉమ్రాన్ మాలిక్ని పిలుస్తారు. ఇతను ఆస్ట్రేలియా వెళ్లి భారత బృందంతో కలవాల్సి ఉంది. టీమిండియా జట్టుకు సంబంధించి హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ కోసం ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ తో నెట్ మ్యాచ్ ఆడేందుకు వీళ్లను ఎంపిక చేసాడు. ఆస్ట్రేలియా పిచ్ లపై బౌలింగ్ మంచి వేగంతో పాటు, బౌన్సర్లు కూడా పడతాయి.
క్రికెట్ కు సంబంధించి ప్రపంచ కప్ అనేది జరగబోతుంది. ఈ ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కాబోతుంది. ఈ ప్రపంచ కప్ ఆడదాం కోసం టీమిండియా అనేక కసరత్తులు చేస్తుంది. దీనిలో భాగంగానే ముందుగానే ఆసిస్ చేరుకుని లోకల్ టీం తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇక 23న చిరకాల ప్రత్యర్థి అయిన పాటిస్తాను తో తలపడి టీమిండియా తమ వరల్డ్ కప్ వేటను ప్రారంభిస్తుంది.
అందుకోసమే గంటకి 150కి పైగా వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ తో టీమిండియా జట్టుకు సంబంధించిన బ్యాటర్లకు ప్రాక్టీస్ చేయించాలని ద్రవిడ్ ప్లాన్. కుల్దీప్ సేన్ లెఫ్ట్ ఆర్మూర్ ఫెసర్. కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ప్రాక్టీస్ చేయించేందుకు నెట్ బౌలర్గా తీసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కు ఈ ముగ్గురు బ్యాటర్లు ఇబ్బంది పడతారని విషయం తెలిసిందే కానీ వరల్డ్ కప్ కు సంబంధించి ఎవరు ఏ విధంగా బాల్ వేస్తారో తెలియదు కాబట్టి కుల్దీప్ తో ఈ ముగ్గురి వీక్నెస్ను తగ్గించాలని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఇందుకుగాను ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సెన్ ఆస్ట్రేలియా రావాల్సిందిగా పిలుపునిచ్చాడు. వరల్డ్ కప్ లాంటి పెద్ద, మెగా వేదికలపై నెట్ బౌలర్లుగా వెళ్లడం, ఈ యువ బౌలర్లకు ఒక మంచి అవకాశం. అయినప్పటికీ ఈ ఇద్దరు బౌలర్లు ఆస్ట్రేలియా వెళ్లడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందికి కారణం వీరిద్దరికీ కొంత వీసా సమస్యలనేవి వచ్చాయి. ఇప్పటికే ఈ ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియా జట్టుతో నెట్ బౌలింగ్ చేస్తూ ఉండాల్సింది కానీ వీసా సమస్యలు తలెత్తడం వల్ల ప్రస్తుతం ముస్తాక్ అలీ టోఫీలొ ఆడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరిని ఆస్ట్రేలియా పంపడానికి బీసీసీఐ కూడా ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా వెళ్ళనున్నారు