Cricket

Surya Kumar: నెంబర్ 1 స్థానం రెండు రోజులే

Surya Kumar Yadav: SKY: ప్రపంచ క్రికెట్ లో సంచలనాలను నమోదు చేస్తున్న భారత్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ దురదృష్టం వెంటాడింది. ఏడాది కాలంగా మంచి ఆటను ప్రదర్శన చేస్తూ అగ్రస్థానం వైపు దూసుకు వచ్చిన సూర్య కుమార్ యాదవ్.. ఆ ర్యాంకుకు చేరుకున్నట్లే చేరి మళ్లీ కిందకు పడిపోయాడు. దీంతో పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ మరోసారి అగ్ర పీఠం పై నిలిచాడు.

గ్రౌండ్లో నలువైపులా చాలా సులువుగా మిస్టర్ ఇండియా 360గా పేరు తెచ్చుకున్న సూర్య అందుకు తగ్గట్లుగా సంచలన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.

Surya Kumar
నెంబర్ 1 స్థానం రెండు రోజులే

ఇంగ్లాండ్ తో జరిగిన టీ 20 సీరిస్ మధ్యలో టాప్- 2 ర్యాంకుల్లోకి వచ్చిన సూర్య మూడో టీ 20 లో రెస్ట్ ఇవ్వడంతో నెంబర్ వన్  టీ 20 పేపర్ అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. అయితే.. కొత్తగా సందేశంలో సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి రెండు టీ 20 మ్యాచుల్లో సూర్య సెన్సేషనల్ పర్ఫామెన్స్ చూపించాడు.

మొదటి టీ20లో 33 బంతుల్లో 5 ఫోర్లు మూడు సిక్సర్లతో 50 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ రెండో టీ 20లో 22 బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో 61 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శనతో ఒకసారిగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకును అందుకున్నాడు. 854 పాయింట్లతో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ ను సమం చేశాడు. అయితే అది రెండు రోజుల్లో ముగిసిపోయింది.

సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడో టీ 20లో ఆరు బాల్స్ లో 8 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ 18 పాయింట్లు కోల్పోయి రెండో 838 స్థానానికి దిగజారాడు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ మరొకసారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ 20 వరల్డ్ కప్ 2022 స్టార్ట్ అయ్యే వరకు దయాధి దేశాలకు ఎలాంటి మ్యాచ్ లేవు. దీంతో అప్పటివరకు ఆ స్థానం మహమ్మద్ రిజ్వాన్ దే. అయితే అక్టోబర్ 23న మోల్ బోర్న్ వేదికగా ఈ రెండు టీముల మధ్య జరిగే మ్యాచ్ సూర్య భాయ్ వర్సెస్ మహమ్మద్ రిజ్వాన్ గా మారనుంది.

కాగా భారత్ టీం టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆశలన్నీ సూర్య కుమార్ యాదవ్ రాణించడం పైనే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చే సూర్య వరకు గ్రీస్లో ఉంటే బౌలింగ్ లైన్ ఫ్ వీక్ గా ఉన్నా.. ఎలాగోలా నెట్టుకు రావచ్చు. అదే సూర్య తన ఆటను కొనసాగించకపోతే వారి స్కోరును ఆశించడం అత్యాశే. దీంతో మిస్టర్ 360 రానించడం పైనే భారత్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button