CricketSports News

Virat Kohli:విరాట్ కోహ్లీ ఖాతాలోకి చేరిన మరో అవార్డు

టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరిగింది. ఈ టోర్నీలో టీమిండియా జట్టు రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో పోటీపడి ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్లో పాకిస్తాన్తో తలపడి ఇంగ్లాండ్ విజయం సాధించి వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది.

సూపర్ 12 మ్యాచ్ లకు కి సంబంధించి టీమిండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో విజయం సాధించి, నెక్స్ట్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై గెలిచి, తర్వాత సౌత్ ఆఫ్రికా తో ఓడి, బంగ్లాదేశ్ ,జింబాబ్వే జట్లను ఓడించి గ్రూపు బి టాపర్గా నిలిచి సెమీఫైనల్కు చేరుకున్న టీమిండియా రెండవ సెమీఫైనల్ మ్యాచులు ఇంగ్లాండ్ తో పోటీపడి దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సెమీఫైనల్ నుంచి ఇంటిదారి పట్టింది.

విరాట్ కోహ్లీ ఖాతాలోకి చేరిన మరో అవార్డు.
విరాట్ కోహ్లీ ఖాతాలోకి చేరిన మరో అవార్డు.

ఇలా ఓటమి పాలు కావడం వల్ల టీమిండియా జట్టు బాగానే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన ద్వారానే కనీసం సెమీఫైనల్ వరకన్నా చేరుకుంది అంటూ టీమిండియాను విమర్శించారు. లేకుంటే సూపర్ 12 నుంచి ఇంటిదారి పట్టేది అంటూ విమర్శలు చేశారు. నిజానికి ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన అంతా గా ఏమీ అనిపించలేదు.

తొలి మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారి ప్రదర్శన సామాన్యంగానే అనిపించింది. సెమీ ఫైనల్ -2మ్యాచ్లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో స్కోర్ చేసిన బౌలింగ్ లో ఫెయిల్ అయ్యి టీమిండియా ఇంటి దారి పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టీమిండియా అభిమానులకు, భారత జట్టు వల్ల ఊరట నిచ్చే విషయం జరిగింది.అదేంటంటే విరాట్ కోహ్లీ కి అవార్డు రావడం. ఈ టోర్నమెంట్లో విరాట్ కోహ్లీకి “నిస్సాన్‌ బెస్ట్‌ ప్లే ఆఫ్‌ ద టోర్నమెంట్‌” అవార్డు వచ్చింది.

సూపర్ 12 మ్యాచ్ల్లో టీమిండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఉండి ఇండియా జట్టును ఒంటె చేత్తో గెలిపించడం జరిగింది. అద్భుత ప్రదర్శన చేశాడు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ.పాకిస్థాన్‌ టాప్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ లో 19వ ఓవర్ లో లాస్ట్ రెండు బంతులను సిక్సులు కొట్టి మ్యాచ్ లో టీమిండియా కు విజయాన్ని అందించాడు.

గుడ్‌లెంత్‌ డెలవరీని బౌలర్‌ తలపై నుంచి స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్‌ ఒక అద్భుతం. ఇలాంటి డెలివరీ ఏ క్రికెటర్ కూడా కొట్టలేదని, విరాట్ కోహ్లీ కి మాత్రమే సొంతమని క్రికెట్ ప్రపంచం మొత్తం చెప్పింది. పాకిస్తాన్ కి సంబంధించిన మాజీ క్రికెటర్స్ కూడా ఈ షార్ట్ ని కొనియాడారు. నెక్స్ట్ ఫైన్‌లెగ్‌ మీదుగా మరో ఫ్లిక్‌ సిక్స్‌ ఇది ఒక సూపర్ షార్ట్. ఈ రెండు సిక్స్ లను చూసి” నిస్సాన్ బెస్ట్ ప్లే ఆఫ్ ద టోర్నమెంట్”అవార్డుని అందించారు. ఇక ఐసీసీ విషయానికి వస్తే గ్రేటెస్ట్ సింగిల్ టి20 షార్ట్ ఆఫ్ ది ఆల్ టైం అని కోహ్లీ కొట్టిన స్ట్రైట్ సిక్స్ ని కొని ఆడింది ఐసీసీ.

ఇంకా టీమిండియా అభిమానులు కోహ్లీకి అవార్డు వచ్చిన వార్త తెలియగానే చాలా సంతోషించారు. ఈ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అతని ప్రదర్శనను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అద్భుతం. ఈ ఒక్క అవార్డు మాత్రమే కాదు ఎన్నో అవార్డ్స్ విరాట్ కోహ్లీ సొంతం.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button