Sports News

T20 WC 2022:టీమిండియా ఓటమిపై స్పందించిన పాక్ క్రికెటర్ అక్తర్

T20 WC 2022: క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ లో భాగంగా సెకండ్ సెమి ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెటర్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్ 12 వరకు బాగా ఆడిన భారత్ సెమి ఫైనల్ లో గెలవలేకపోయింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ చేసి టీమిండియా 168/6 స్కోర్ చేసింది. ఈ టార్గెట్ ను ఇంగ్లాండు ఓపెనర్స్ టీమ్ ఇండియాకు ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా పది వికెట్ల తేడాతోనే, ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే సిక్స్ లు ఫోర్ లతోనే మాట్లాడుతూ జట్టును ఒంటి చేత్తో గెలిపించారు. ఫైనల్ కి పంపించారు.

టీమిండియా ఓటమిపై స్పందించిన పాక్ క్రికెటర్-షో కబ్ అక్తర్
టీమిండియా ఓటమిపై స్పందించిన పాక్ క్రికెటర్-షో కబ్ అక్తర్

బౌలింగ్ లో లోపాలున్న, చాలామంది ఫామ్ లో లేకపోయినా, కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ టీమిండియా జట్టును సెమీఫైనల్ వరకు తీసుకొచ్చారు.

ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా పెట్టిన టార్గెట్ ని ఇంగ్లాండ్ ఓపెనర్స్ అయినా బట్లర్, అలెక్స్ ఇద్దరే ఊది పడేశారు. ఇక టీమిండియా అభిమానుల విషయానికొస్తే సెమీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ కు వెళ్లి పాకిస్తాన్ తో తలపడాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుతున్నారు. కానీ వాళ్ళ ఆశలను నిరాశగా మార్చేశారు.

ఈ ఓటమిపై పాకిస్తాన్ క్రికెటర్ షోకబ్ అక్తర్ స్పందించాడు. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలవాలని అనుకునే అక్తర్ టీమిండియా ఓటమి తర్వాత ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

టీమిండియా చాలా చక్కగా ఆడింది. బౌలింగ్ లో ఏమాత్రం సరిగా చేయలేదు, చాహల్ ను ఎందుకు ఆడించలేదు కూడా తెలియదు, టీం సెలక్షన్ కూడా సరిగా చేయలేదు, ఆస్ట్రేలియా అంటేనే బౌలింగ్ కి పెట్టింది పేరు. అలాంటి ఆస్ట్రేలియాలో ఒక్క కరెక్ట్ ప్లేయర్ కూడా ఆడలేదు.

పిచ్అనుకూలిస్తే గాని వికెట్లు తీయలేరు. వికెట్లు తీయాలని కూడా భారత బౌలర్లకు అనిపించలేదు.వికెట్లు పడకుండా ఇంగ్లాండ్లు బ్యాటర్స్ బాగా ఆడుతుంటే కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటూ ఇంగ్లాండ్ తర్వాత టీమ్ ఇండియా చేతులు ఎత్తేసినట్లు అనిపించింది. ఫైనల్లో మీతో ఆడాలనుకుంటే మీరేమో ఓడిపోయారు అంటూ ఘాటు విమర్శలు చేశాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button