Sports News

Arjun Tendulkar: బౌలింగ్లో భారీ మార్పులు కారణం ఎవరంటే?

Arjun Tendulkar: క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరగబోతున్నాయి. దీంట్లో భాగంగా కొంతమంది బౌలర్లకు గాయాలపాలై ఈ టోర్నమెంట్ నుంచి తొలగిపోవడం కూడా జరిగింది .క్రికెట్ ఆటకు సంబంధించి సచిన్ టెండూల్కర్ పేరు అందరికీ తెలిసిందే, ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ చాలా బాగా ఆడుతున్నాడు. దీంట్లో భాగంగా ఈ టోర్నమెంట్లో ప్రస్తుతం ఇప్పటివరకు మూడు మ్యాచ్లు జరిగాయి.

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో భారీ మార్పులు కారణం ఎవరంటే?
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో భారీ మార్పులు కారణం ఎవరంటే?

ఈ మూడు మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్ ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. మొత్తంగా 10 ఓవర్లు వేసినా అతను కేవలం 47 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అదరగొడుతున్నాడు. గత ఏడాదిలో ముంబై జట్టులో ఉన్నాడు.

కానీ పెద్దగా ఆడే అవకాశాలు అయితే రాలేదు. ఈ కారణంగా అర్జున్ టెండూల్కర్ గోవాకు మారడం జరిగింది. దీంట్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా తన స్కిల్స్ ని మెరుగుపరుచుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అర్జెంటు ఎన్నిక 10 ఓవర్లు వేసి, కేవలం 47 పరుగులు మాత్రమే ఇచ్చి, ఆరు వికెట్లు తీయడం అనేది విశేషం. అర్జున్ టెండూల్కర్ లో వచ్చిన ఈ సడన్ మార్పు కు కారణమేంటి అని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం కొన్ని నెలల క్రితం టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజు సింగ్ తండ్రి, యోగ్ రాజ్ సింగ్ దగ్గర అర్జున్ టెండూల్కర్ కోచింగ్ తీసుకుంటున్నాడు.

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కి సంబంధించిన మేలుకువలు కూడా నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసిన తర్వాత యోగరాజు సింగ్ అతడికి మెలుకువలు చెబుతున్నట్లు ఉంది. ఈ కోచింగ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ హైదరాబాదులో జరుగుతుంది. అతడు తొలి మ్యాచ్ లోనే నాలుగు ఓవర్లు వేసి, పది పరుగులు మాత్రమే ఇచ్చి, నాలుగు వికెట్లు తీయడం అనేది విశేషం.

అయితే ఈ మ్యాచ్ లో గోవా జట్టు గెలవలేకపోయింది. తర్వాత పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో అర్జున్ 2 ఓవర్లు వేసి పన్నెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. యూపీ లో జరిగిన మ్యాచ్ లో కూడా ఇతను మెరిశాడు. చేజింగ్లో ఆ జుట్టు తొలి ఓవర్ లోనే దెబ్బతీశాడు. ఓపెనర్, కెప్టెన్, కరణ్ శర్మాను (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత యూపీని రింకు సింగ్, సమీర్ చౌదరిలు ఆదుకున్నారు. ఈ సమయంలో మళ్లీ బౌలింగ్ వచ్చిన అర్జున్ కీలకమైన సమీర్ చౌదరి వికెట్ను తీసి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో గోవా 11 పరుగుల తేడాతో గెలిచింది.

నాలుగు ఓవర్లు వేసినా అర్జున్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మొన్నటి వరకు కూడా ఆల్రౌండర్ గా ఉన్న అర్జున్ ప్రస్తుతం బౌలింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మంచి ఫేస్ తో బాళ్లను వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అర్జున్ ఇదే రీతిలో ఇంప్రూవ్ అవుతూ వెళ్తే ఏదో ఒక రోజు టీమిండియా జట్టులో బౌలర్గా చోటు దక్కించుకునే అవకాశం కూడా ఉంది.

ఎంతైనా సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ ఆటను ఆడడం, క్రికెట్ నే తన ఫ్యూచర్ గా భావించి క్రికెట్ ప్లేయర్ గా తన గోల్ ని పూర్తి చేసుకోవాలని తన తండ్రి అంత గొప్ప పేరు తీసుకురావాలని సచిన్ టెండూల్కర్ అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button