Sports News

India Vs Bangladesh T20: చివరి బాల్ వరకు కొనసాగిన ఉత్కంఠ

India Vs Bangladesh T20: చివరి బాల్ వరకు కొనసాగిన ఉత్కంఠ. టి20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా నవంబర్ రెండో తేదీ బుధవారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. అడిలైడ్ ఓవల్ స్టేడియం, అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం.

టీమిండియా జట్టుకు సంబంధించిన ప్లేయర్స్–కెప్టెన్ రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ,అర్ష్ దీప్ సింగ్.

బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ప్లేయర్స్–షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హుస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, ఆఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మోసద్దెఖ్ హుస్సేన్, షోరీ ఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్ (డబ్ల్యూ), ముస్తాఫిజూర్ రహిమాన్, హసన్ మహమూద్, టాస్కిన్ అహ్మద్.

బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, హసన్ చేతిలో అవుట్ అయ్యాడు. ఈయన 8 బంతుల్లో రెండు పరుగులు చేసి 3.2 ఓవర్సులో ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ ఇన్. సూర్య కుమార్ యాదవ్, షేకీబ్ చేతిలో అవుట్ అయ్యాడు.

16 బంతుల్లో 30 పరుగులు చేసి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో ఐదు రన్స్ చేసి హసన్ చేతిలో అవుట్ అయ్యాడు.15.1 ఓవర్లో అవుట్ అయ్యాడు.

184/6 దినేష్ కార్తీక్, షొరీ ఫుల్ చేతిలో ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి 16.5 ఓవర్ లో అవుట్ అయ్యాడు. అక్షర పటేల్, హసన్ చేతిలో ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేసి 18.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు. టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 184/6 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ కి 185 పరుగుల టార్గెట్ ఇచ్చింది టీమిండియా జట్టు.

రవీంద్రన్ అశ్విన్ చేతుల్లో లిటన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులు చేసి 7.2 ఓవర్లలో అవుట్ అయ్యాడు. షమీ చేతిలో షాంతో 25 బంతుల్లో 21 పరుగులు చేసి 9.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు. హొస్సైన్, అర్షదీప్ చేతిలో 11.1 ఓవర్లో ఐదు బంతుల్లో మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అర్షదీప్ సింగ్ చేతిలో షకీబ్ 13 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యాసిర్ అలీ, హార్దిక్ పాండ్యా చేతిలో ఒక బంతిలో ఒక పరుగు చేసి 12.2 ఓవర్లో అవుట్ అయ్యాడు.

ఒక్క రన్ అవుట్ తో మ్యాచ్ తిప్పిన కేఎల్ రాహుల్. మ్యాచ్లో గెలుపు ఓటములను నిర్ణయించేది రన్ అవుట్ కూడా అప్పుడప్పుడు అని చెప్పవచ్చు. కేఎల్ రాహుల్ అద్భుతమైన తో మంచి ఫామ్ లో ఉన్న లిటన్ దాస్ ను ఔట్ చేశాడు. మంచి ఫామ్ లో ఉన్న దాస్ 32 బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో 50 పరుగులు చేశారు.

Highlighs:

హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మోసద్దేక్ హుస్సేన్ మూడు బంతుల్లో ఆరు పరుగులు చేసి 12.5 ఓవర్లో అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్ జట్టు 145/6 పరుగులు చేసి టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. టీమిండియా జట్టు ,బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది. టీమిండియా జట్టు ప్రస్తుతం ఆరు పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button