Sports NewsCricket

KL Rahul:పెళ్లి పీటలు ఎక్కబోతున్న KL రాహుల్

టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ ముగిసింది. ఈ సంవత్సరం వరల్డ్ కప్ ని క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగి దీంట్లో పాకిస్తాన్ విన్ అయ్యి ఫైనల్ కు చేరుకుంది.

రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగే ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ తలపడి ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ని సాధించింది. ఇక టోర్నమెంట్ ముగియడంతో అన్ని జట్లు కూడా వైపాక్షిక సిరీస్ లపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో భారత జట్టు న్యూజిలాండ్తో ఈనెల 18వ తేదీన తలపడనుంది. ఈ టూర్ లో మూడు వన్డేలు, నువ్వు టి20 లు ఆడనుంది.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న KL రాహుల్
పెళ్లి పీటలు ఎక్కబోతున్న KL రాహుల్

ఇదిలా ఉంటే ఈ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే టీమిండియా బ్యాటర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరని తెలుసుకోవడానికి అందరూ నెట్ ఇంట్లో వెతుకుతున్నారు. ఆ అమ్మాయి ఎవరంటే బాలీవుడ్ సీనియర్ హీరో అయిన సునీల్ శెట్టి గారి ఏకైక కూతురు అయిన అతియా శెట్టి నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది.

అయితే గత మూడేళ్ల నుంచి కేఎల్ రాహుల్, అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం వీళ్లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ కొన్నిసార్లు కనిపించారని తెలిసింది. వీళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారని, పెళ్లి పనులు మొదలయ్యాయని ప్రస్తుతం ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని, వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి లో వీరి వివాహం జరుగుతుందని సమాచారం. పెళ్లి తర్వాత ఈ జంట కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారట. సమాచారం ప్రకారం ముంబైలోని, పాలీ హిల్ ,లోని సందు ప్యాలెస్ లోని విలాసవంతమైన ఇంటికి వివాహం తర్వాత వెళ్లనున్నట్లు తెలిసింది. పెళ్లి విషయం పక్కన పెడితే టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంటులో కేఎల్ రాహుల్ తన ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button