Sports News

NewZealand vs India:మూడో వన్డే మ్యాచ్-ఆల్ అవుట్ అయిన టీమిండియా

ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా 3 t20 లు, మూడు వన్డేలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ జరిగింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. శిఖర్ ధావన్ మూడు వన్డేల్లో టాస్ ఓడిపోవడం గమనార్హం.
జట్ల వివరాలు:
భారత్ ప్లేయర్స్-
శిఖర్ ధావన్ కెప్టెన్, శుభ్ మన్ గిల్, శ్రేయాష్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్,, సంజు శాంసన్, దీపక్ హుడా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ ప్లేయర్స్-
ఫిన్ అలెన్,డేనవ్ కాన్వే, కేన్ విలియంసన్ కెప్టెన్, దారిల్ మిచల్, టామ్ లథమ్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ సాంటర్న్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టీం సౌథీ, లాకి పేర్గూసన్.

న్యూజిలాండ్ Vs భారత్ మూడో వన్డే మ్యాచ్-ఆల్ అవుట్ అయిన టీమిండియా
న్యూజిలాండ్ Vs భారత్ మూడో వన్డే మ్యాచ్-ఆల్ అవుట్ అయిన టీమిండియా

న్యూజిలాండ్ బౌల్లెర్స్ వేసిన బౌలింగ్కు అనుకూలంగా వాషింగ్టన్ సుందర్ 51 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులు సాధించారు. మిగతా వాళ్ల ప్రదర్శన అంతంత మాత్రమే ఉండడంతో టీమిండియా ఈ మ్యాచ్ లో పెద్ద స్కోర్ సాధించలేకపోయింది. న్యూజిలాండ్తో మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ తన బ్యాటింగ్ ముగిసిన తర్వాత 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇక భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ విషయానికి వస్తే 64 మంత్రుల్లో 51 పరుగులు చేశాడు. ఇతను ఐదు ఫోర్లు ఒక సిక్స్ కూడా కొట్టాడు. వికెట్లు పడుతున్నప్పటికీ ధైర్యంతో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా ఒక మాదిరి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర కూడా పోషించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ విషయానికొస్తే 49 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 28 పరుగులు చేసాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో డారిల్ మిచెల్ మూడు వికెట్లు, టీం సౌథీ రెండు వికెట్లు, లక్కీ పేర్గూసన్, మిచల్ సాంట్నర్ ఒక్కొక్క వికెట్టు తీశారు. 8.4 ఓవర్లలో భారత్ 39 పరుగుల వద్ద మొదటి వికెట్ చేజార్చుకుంది. 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 43/1 స్కోర్ చేసింది .55 పరుగుల వద్ద రెండో వికెట్ కూడా కోల్పోయింది ఇన్ ఇండియా. 15 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 62/2స్కోర్ చేసింది.20.3 ఓవర్లో 85 పరుగులు చేసి మూడో వికెట్ను కూడా చేజార్చుకుంది. భారత్ 26 ఓవర్లు పూర్తి అయ్యేసరికి121/5స్కోర్ చేసింది. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా145/5 స్కోర్ చేసింది. 39 ఓవర్ పూర్తయ్యేసరికి172/7స్కోర్ చేసింది.

వన్డే అయ్యేసరికివన్డేమ్యాచ్లో కివీస్ 43 ఓవర్లో స్పిన్నర్ ని దింపింది. ఇతను కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 43 ఓవర్లకు భారత్ 189/7 స్కోర్ చేసింది. దీపక్ హుడా రెండు పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. దీపక్ చాహర్ 12 పరుగులు చేసి డారిల్ మిచల్ చేతిలో అవుట్ అయ్యాడు. కివీస్ బౌలర్లు ఎక్కువ పరుగులు చేసే అవకాశం టీమ్ ఇండియాకు ఇవ్వట్లేదు.

టీమిండియా బ్యాటింగ్ ముగిసిన తర్వాత 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి టీమిండియా ఆల్ అవుట్ అయింది. ఇక న్యూజిలాండ్ కి 220 పరుగులు టార్గెట్ గా ఇచ్చింది టీమిండియా. ఇంకా విజయం ఎవరిని వరుస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button