ఈ సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి విశిష్టత తెలుసా?

ఈ సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి విశిష్టత తెలుసా?

కృష్ణుడు అష్టమి రోజున జన్మించినందువల్ల శ్రీ కృష్ణాష్టమి అని పిలుస్తారు. కృష్ణాష్టమి రోజున నువ్వులు, ఉసిరికాయ పిండితో, స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని, గడపలకు పసుపు రాసి ఇంటికి మావిడాకులు రకరకాల పూలతో తోరణాలు కట్టాలి.  కృష్ణుడికి పొన్న చెట్టుకు సంబంధం చాలా ఉంది. ఎందుకంటే గోపిక వస్త్రాపహరణం చేసి పొన్న చెట్టు పైనే కూర్చుంది. అందుకే పొన్నచెట్టు అన్ని రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని గ్రంథాలు తెలుపుతున్నాయి.

అందుకని ఆరోజు కృష్ణునికి పొన్న పూలతో పూజ చేయాలి. పూజ కోసం శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూలతోను తులసి దళంతోనూ అందంగా అలంకరించుకోవాలి. పూజ చేసే స్థలంలో చిన్న మండపాన్ని నిర్మించుకోవాలి. ఇంటి లోపలికి శ్రీకృష్ణుడు నడిచి వస్తున్నట్టుగా పాదముద్రలు వేయాలి. మండపం దగ్గర ముగ్గులతో అలంకరించాలి. రకరకాల పూలతో దేవునికి పూజించాలి. తనకెంతో ఇష్టమైన వెన్న,నెయ్యితో చేసిన పిండి వంటలు, అటుకులతో తయారు చేసిన వంటకాలు, పానకం నైవేద్యంగా పెడతారు. కొన్నిచోట్ల మినప పిండిని, పంచదారను కలిపి కాయం చేసి పెడతారు. మరికొన్నిచోట్ల సొంటి,మిరియం నీళ్లతో కలిపి బాగా నూరి బెల్లం పానకంతో కలిపి నెయ్యి వేసి ఉక్కిరిని తయారు చేసి పెడతారు.

ఈ పూజను మధ్యాహ్నం సాయంత్రం, రాత్రి 12 గంటల సమయంలో చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని ఈ విధంగా చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి కృష్ణాష్టకం, కృష్ణుని అష్టోత్తర నామం చదువుకుంటూ కాలక్షేపం చేస్తారు. శ్రీకృష్ణుడు దొంగతనంగా ఉట్టిలో ఉండే వెన్న తినేవాడని దానికి గుర్తుగా సాయంత్రం సమయంలో అందరూ కలిసి ఉట్టికొట్టే పోటీలు పెట్టుకొని ఆడతారు కొందరు శ్రీకృష్ణ లీలలు పాడుతారు, కృష్ణ జననం, రాస క్రీడలు వంటి వాటిని నాటకాలుగా ప్రదర్శించుకుంటారు.

ఈరోజున కృష్ణయ్య అల్లరులను గుర్తుకు చేసుకొని కృష్ణుని పాదాలను ఇంటిలో వేసుకొని చిన్న పిల్లలు ఉండే ఇంటిలో మగ పిల్లలకు కృష్ణుని అవతారం, ఆడపిల్లలకి గోపికల లాగా తయారు చేస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. సంతానం లేనివారు సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. రుక్మిణి కల్యాణ పారాయణం చేస్తే వివాహ బంధం బలపడుతుందని నమ్ముతారు.

ఈ సంవత్సరం కృష్ణాష్టమి విశిష్టత: ఈ సంవత్సరం కృష్ణాష్టమి 18వ తేదీ గురువారం మరియు 19వ తేదీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం 19వ తేదీన కృష్ణాష్టమి జరుపుకుంటారు.

అదే రోజు నాలుగవ శ్రావణ శుక్రవారం. ఈ పూజను మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళలో చేస్తారు. అష్టమి తిధి ఆగస్టు 18 గురువారం రాత్రి 12 గంటల 30 నిమిషాల నుండి ప్రారంభమై, శుక్రవారం రాత్రి ఒంటిగంట వరకు ఉంటుంది. ఆ రోజు నక్షత్రం కృత్తిక ఆగస్టు 19 సూర్యోదయానికి ముందు వేకువజామున నాలుగు గంటల 53 నిమిషాల వరకు ఉండి, ఆ తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది. పూజ చేసుకోవాలి అనే అనుకునే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు ,సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల లోపు చేసుకోవాలి.

నాలుగోవ శ్రావణ శుక్రవారం కలిసినందువల్ల ఉదయం పూట వరలక్ష్మి అమ్మవారిని పూజించి ,సాయంత్రం కృష్ణుని పూజ చేసుకోవచ్చు ఈ రోజు కృష్ణుని పూజిస్తే సకల సౌభాగ్యాలను పొందవచ్చని మన పూర్వీకులు తెలుపుతున్నారు.ఈరోజున కృష్ణనే లీలలను చదవాలి, సంతానం లేనివారు శ్రీకృష్ణ జననం గురించి చదవడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. వివాహం త్వరగా అవ్వాలి, వివాహం జరగదు అనుకునేవారు ఈ రోజున రుక్మిణి కళ్యాణం ఘట్టాన్ని చదివితే ఫలితం ఉంటుంది. ప్రతి తల్లి తనను తాను యశోదగా భావించి కృష్ణుని పాదముద్రలు వేసుకొని కటిక ఉపవాసం ఉండి అర్ధరాత్రి శ్రీకృష్ణుడు పుట్టాడని భావించి ఆ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

ఈ రోజున ఖాయం అనే నైవేద్యాన్ని సమర్పిస్తారు. పండ్లు పాలు వెన్నె వంటి వాటిని పెడతారు. నిష్టతో చేసేవారు మూడు పూటలా పూజ చేయాలి సూర్యోదయానికి ముందే ఒకసారి ,మధ్యాహ్నం మరొకసారి చివరగా అర్ధరాత్రి చేయాలి. ఉపవాసం ఉన్నవారు కచ్చితంగా మూడుసార్లు పూజ చేసుకోవాలి.ఈ సంవత్సరం మొదటి పూజ 19 శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల 59 నిమిషాలకు ప్రారంభమై, తొమ్మిది గంటల లోపు చేసుకోవచ్చు. రెండవసారి 12 గంటలకు పూజ చేసుకోవాలి.మూడవసారి శుక్రవారం రాత్రి 12 గంటల నాలుగు నిమిషాల నుండి 12:48 లోపు చేసుకోవచ్చు. ఉపవాస దీక్షను సాయంత్రం పూజ తర్వాత విరమించుకోవచ్చు.