Rip Krishna:సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత శోకసంద్రంలో టాలీవుడ్ సినీ రంగం

ప్రముఖ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయనకు గుండెపోటు రావటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు.

కృష్ణకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి వైద్యులు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు..

డాక్టర్‌ గురు.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ గుండెపోటుతో స్పృహలో లేని స్థితిలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత శోకసంద్రంలో టాలీవుడ్ సినీ రంగం

ఆసుపత్రికి తీసుకురాగానే ఆయనకు ఎమర్జెన్సీ విభాగంలో వైద్యం అందించాం. 20 నిమిషాల పాటు సీపీఆర్‌ చేసి గుండెపోటు నుంచి బయటపడేలా చేశాం. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నాం. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాలి.

 ఇప్పటినుంచి ప్రతి గంటా కూడా కీలకమే. 24 గంటల తర్వాత మళ్లీ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తాం’’ అని అన్నారు. కాగా, తెలుగు చిత్ర సీమలో కృష్ణ సూపర్‌ స్టార్‌గా తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. 

దాదాపు 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో.. కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు. సినిమాల్లో హీరోగా నటించటంలోనూ రికార్డులను నెలకొల్పారు.

ఒకే ఏడాది అత్యధిక సినిమాల్లో నటించి, విడుదల చేశారు. 70-80లలో ఒక సంవత్సరం 10కిపైగా సినిమాలు విడుదల చేసేవారు. నిర్మాతగా కూడా ఎన్నో హిట్టులతో పాటు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను నిర్మించారు. వయసు పైబడటంతో గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.2019లో ఆయన సతీమణి విజయ నిర్మల మరణంతో తీవ్రంగా కృంగిపోయారు. ఆ బాధనుంచి కోలుకోకముందే మొదటి భార్య ఇందిరా దేవి కూడా ఆయన్ని విడిచి వెళ్లిపోయారు. 

2022 సెప్టెంబర్‌ నెలలో అనారోగ్య స‌మ‌స్యల‌తో హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఇందిరా దేవి మరణం తర్వాతినుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ ఆయన భార్య ఇందిరా దేవి కృష్ణ ఆరోగ్యం ఏమీ బాలేదు ఆయన ఆరోగ్యం క్షీణించింది కృష్ణ మరణ వార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన తృది శ్వాస విడిచారు.

అనారోగ్య సమస్యతో 80 ఏళ్ల వయసులోనే కళ్ళు మూశారు. నిన్న హార్ట్ ఎటాక్ శ్వాస ఇబ్బందులతో హైదరాబాదులోని కాంటినెంటల్ హాస్పిటల్ కృష్ణ అడ్మిట్ చేశారు శరీరంలోని ప్రధానమైనవి అవయవాది ఏది పనిచేయలేదు. డాక్టర్స్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన మరణించారు. వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించలేదు. ఆయన 48 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేదని చెప్పారు.

కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు కానీ వైద్యుల ప్రయత్నాలను గాని అభిమానుల పూజలు గాని ఏ ఒక్కటి ఫలించలేదు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కృష్ణ తుది శ్వాస విడిచారు.