ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్…. ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TSRTC) ఎండిగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ సంస్థను గాడినపెట్టె చర్యలు ప్రారంభించారు.
అయితే ఆర్టీసీ విషయంలో పని చేసే ఉద్యోగుల సహకారం లేకుండా సంస్థను గాడిన పెట్టడం సాధ్యం కాదని భావించి ఆయన ముందుగా వారి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఉద్యోగ వేతనాల విషయంలో సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. ఆ సంస్థల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందడం లేదు. దాదాపు సగం గడిచిన తర్వాత అంటే 10 నుండి 15 వ తేదీ లోపు విడతలవారీగా జీతాలు అందుతున్నాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సజ్జనార్ ముందుగా ఉద్యోగుల జీతాల సమస్యలు పరిష్కరించే చర్యలు చేపట్టారు.
ఈ నెల(October) ఒకటవ తేదీన అంటే ఇవాళ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులందరికీ జీతాలు అందే ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో September నెలలో సంబంధించిన నేడే ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. ఇదే కానీ జరిగితే ఆర్టీసీ ఉద్యోగులు 3 ఏళ్లు తర్వాత మళ్లీ ఒకటో తేదీన జీతాలు అందుకున్నట్లు అవుతుంది.
కొత్త ఎండీ చొరవతో ఆర్టీసీ ఉద్యోగుల ఇళ్లలో దసరా పండగ ముందుగానే రానుంది. తమ సమస్యను గుర్తించి పరిష్కరించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ పై ఉద్యోగులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పండగల సమయంలో సకాలంలో జీతాలు ఏర్పాటు చేయడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.