lang="te"> తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. కీలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. కీలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం



నూతన ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007 చట్ట సవరణ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించింది. సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రవేశ పెట్టగా… సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

తెలంగాణ ఉద్యాన భాండాగారంగా అవతరించిన నేపథ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థలు, కీలక ఉద్యాన రంగంలో ప్రైవేటు పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటుకు అవకాశం కలిగింది. రాష్ట్రంలో ఏకైక అటవీ కళాశాల, పరిశోధన సంస్థ ద్వారా అటవీ రంగంలో బహుళ డిగ్రీ, డిప్లమో కోర్సులు అందించడానికి ఈ విశ్వవిద్యాలయానికి వీలు కల్పించారు. ఫలితంగా ఇక్కడే చదివే విద్యార్థులకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది.అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృతమైన అవకాశాలు గుర్తింపు లభించింది.

దేశంలో ప్రత్యేకించి తెలంగాణ ఉద్యన రంగంలో ఉన్న డిమాండ్, అవకాశాల దృష్ట్యా, ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా వచ్చే ఈ వృత్తి నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.