lang="te"> రైతులకు కేసీఆర్ షాక్… ఇకపై వరి వద్దు ! - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

రైతులకు కేసీఆర్ షాక్… ఇకపై వరి వద్దు !


ఎడారి తెలంగాణలో ఏరులు పారుతున్నాయి.

కరువు తెలంగాణలో కరువు తీరింది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఊరు వాడ చెరువులు, కుంటలు నుండి పోతున్నాయి. దీంతో రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నారు. వరి నాట్లు వేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలోని అత్యధిక వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. ఇలాంటి టైం లో సీఎం కేసీఆర్ రైతులకు షాక్ ఇచ్చారు. ఇకపై వరి వద్దు అని చెప్పారు.

ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇక వచ్చే యాసంగి నుంచి వరి వేయడం అంటే, రైతులు ఉరి వేసుకోవడమే అని వ్యక్తమయింది. యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలు అయినా శనిగలు, వేరుశనగ, పెసర్లు, మినుములు, ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుత వాన కాలంలో 60 లక్షల టన్నుల కు మించి ధాన్యం తీసుకోమని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పినందున, దాన్ని ప్రభుత్వం గాని, మిల్లర్లు గాని కొనుగోలు చేయటానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని తెలిపింది.