హుజురాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్రం ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్ లోనీ బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ నెల 30న ఈ రెండు నియోజకవర్గాలకుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూలు విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

కాగా తెలంగాణలో మాజీమంత్రి  ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో… తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అదేవిధంగా బద్వేల్ లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతిచెందడంతో… బద్వేల్ లోనూ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే డిసెంబర్ 12 లోగా హుజురాబాద్ కు ఎన్నికలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్, బద్వేలు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

షెడ్యూల్ వివరాలు:

•> అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదల

•> నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8

•> అక్టోబర్ 11న నామినేషన్లు పరిశీలన

•> నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13

•> అక్టోబర్ 30వ తేదీన పోలింగ్

•> నవంబర్ రెండో తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker