ఓటుకు నోటు కేసు…నాంపల్లి కోర్టులో ఈడీ చార్జిషీట్
HYD: ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రం పై నాంపల్లి కోర్టు విచారణ ప్రారంభించింది.
కేసులో నిందితులుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సెబాస్టియన్ ఇవాళ నాంపల్లి మెట్రోపాలిటన్ స్టేషన్స్ కోర్టులో హాజరయ్యారు. ఒక్కొక్కరు 25 వేల రూపాయల చొప్పున పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. నాలుగు నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేం విచారణకు హాజరు కాలేదు. సమన్లు ఇచ్చినప్పటికీ విచారణ హాజరు కానందున ముత్తయ్య పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఏసీబీ ఛార్జిషీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ… ఇటీవల అభియోగ పత్రం సమర్పించింది. ఈడీ కేసు తదుపరి విచారణ ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణపై సుప్రీంకోర్టులో ఉన్నందున విచారణ నవంబరు 1 కి కోర్టు వాయిదా వేసింది.