కొత్తగా నియామకమైన కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష…
పది జిల్లాల్లో కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్ లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధరణి పోర్టల్ వ్యవస్థపై వారికి అవగాహన కల్పించారు సిఎస్ గారు. ముందుచూపుతో సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు సోమేశ్ కుమార్ గారు తెలిపారు. భూరికార్డుల సమగ్రంగా ఏకీకృత నిర్వహించుటకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ఇది ఒకటే అని ఆయన వివరించారు.
భూ సమస్యల పరిష్కారానికి దేశంలో మరెక్కడా అ ఇతర రాష్ట్రంలో లో ఈ వ్యవస్థను అమలు చేయటం లేదని అని అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత ఒక సంవత్సరానికి 8 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయని. ధరణి పోర్టల్ ఇప్పటివరకు నాలుగు కోట్ల పైగా గా హిట్లను పొందిందని తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా జరిగి పనిచేసే విధంగా ధరణి మోడల్స్ ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. ధరణి ఆపరేటింగ్ సిస్టం మొత్తం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పనిచేస్తుందని సిఎస్ గారు వెల్లడించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధరణి గ్రీవెన్స్ ను పరిష్కరించడానికి ఉదాహరణలతో జిల్లా కలెక్టర్లు కు వివరించారు.
ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొరకు భూమిని గుర్తించి టిఎస్ఐఎస్ సి స్వాధీనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలలకు ఆ జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించాలని CS సూచించారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడానికి సిద్ధం చేసి ఉంచాలని, అలాగే నిర్మాణంలో ఉన్న కలెక్టర్ పనులు వేగవంతం చేసి త్వరగా అన్ని హంగులతో పూర్తి చేయాలని ఆదేశించారు.