lang="te"> కోకాపేట్ భూముల అమ్మకాలపై సిబిఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

కోకాపేట్ భూముల అమ్మకాలపై సిబిఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు



హైదరాబాద్ శివారులో కోకాపేట్, ఖానామెట్ భూములు అమ్మకాలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ కలిసిన TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్ల నుంచి 1.500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కోకాపేట్, ఖానామెట్ భూముల టెండర్లలో అవినీతి జరిగిందన్నారు. దీనికి సహకరించిన అందరి పైన వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
బిజెపి,టిఆర్ఎస్ కుమ్మక్కయ్యారని అనేది
నిజం కాకపోతే భూముల అమ్మకాలపై సిబిఐ చేత విచారణ జరిపించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వన్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి సూచించారు.

కొద్ది రోజుల క్రితం హెచ్ఎండిఎ కోకాపేట్ భూముల వేలం వేయగా… అధికారులు అంచనాలకు మించి స్పందన వచ్చింది. కోకాపేట లోని 49.92 ఎకరాలను MSTC వెబ్ సైట్ ద్వారా మహా హైదరాబాద్ మహానగరఅభివృద్ధి సంస్థ హెచ్ఎండిఎ వేలం నిర్వహించింది. 25 కోట్ల ఎకరం కనీస ధర నిర్ధారించగా, వేలంలో లో 60 కోట్లు పలికింది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా 2000.37 కోట్ల ఆదాయం లభించింది. భూముల వేలం వెనక రూ.1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.