తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు నేతలు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కొరకు కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకి రాహుల్ తో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రెవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీతో గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, అజ్మతుల్లా, అజరుద్దీన్, మహేష్ గౌడ్, మధు గౌడ్, సమావేశం కానున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ తో సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క కూడా సమావేశం కానున్నారు.
అంతేకాదు ఈ నెలలో కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టూర్ కి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లేదా మహబూబాబాదులో రాహుల్ సభ ఉంటుందని, పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 17 న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు నేతలు.
ఇవాళ సమావేశం తర్వాత ఈ అంశం ఒక కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.