తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా…



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలో ని క్యాడర్ ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

అన్ని శాఖలు తమ తమ పరిధిలో ఖాళీలను సంఖ్యతో సిద్ధంగా ఉంచాలని, దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలో లో 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్థానికత పై రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు మేరకు జిల్లా జోనల్, మల్టీ జోనల్ కేడర్ల వారిగా, మంజూరు అయిన పోస్టులు, అందులోని పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించి వివరాలను నిర్దేశిత నమూనాలో ప్రభుత్వ శాఖలు సోమవారం తమ పరిధిలోని భాగాల నుంచి తప్పించుకు ఉన్నాయి.

తెలంగాణరాష్ట్ర ఆర్థిక శాఖ, మంగళవారం, బుధ గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలో తో వరుసగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన కు తుదిరూపు ఇవ్వనుంది. దీంతోపాటు ఆయా కేడర్లో వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించింది. ఈనెల 9వ తేదీన అన్ని శాఖలోని క్యాడర్ ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం రానుంది. రిక్రూట్మెంట్ ఇతర నియామక సర్వీసు నిబంధనలు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఒకే సారి 50 వేల పోస్టులకు…
శాఖల వారీగా ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నివేదిక సిద్ధం చేయనుంది. ఈనెల 10వ తేదీ లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్ గారు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యి ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఆర్థిక శాఖ సమర్పించనున్న సీఎం కెసిఆర్ సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానున్నది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker