యూనివర్సిటీల ర్యాంకులను ప్రకటించిన కేంద్రం, తెలంగాణ ర్యాంకు ఎంతంటే
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (NIRF) 2021 నివేదిక విడుదల చేసింది. ఆన్లైన్ వేదికగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిపోర్ట్ విడుదల చేశారు.
6 అంశాల ఆధారంగా దేశంలోని విశ్వవిద్యాలయాలు,కాలేజీలకు ఈ నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించారు. ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్ సహా మొత్తం 11 కేటగిరిలో ర్యాంకులు విడుదల చేశారు.
ఓవరాల్ కేటగిరీలో మొట్ట మొదటి ర్యాంకు iit-madras సాధించగా, రెండవ ర్యాంక్ ఐ ఐ ఎస్ సి బెంగళూరు సాధించింది. యూనివర్సిటీలా కేటగిరిలో మొదటి స్థానాన్ని ఐఐఎస్ సీ బెంగళూరు మొదటిస్థానం సాధించగా హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ 9వ స్థానాన్ని సాధించింది. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానం సాధించగా, హైదరాబాద్ ఏడో స్థానం సాధించింది. మెడికల్ కేటగిరిలో ఢిల్లీ ఎయింస్ మొదటి స్థానం సాధించగా, లా కేటగిరీలో హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్సిటీ 3 వ స్థానాన్ని కైవసం చేసుకొంది.