TSRTC MD సజ్జనార్ సంచలనం నిర్ణయం.
Rtc md sajjanar: సంచలనాలకు మారుపేరు అయిన ఐపీఎస్ అధికారి VC సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు.
ఇటీవల అమాయకుడిలా గా సాధారణ ప్రయాణికుడిలా గా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల పై అశ్లీల పోస్టర్లను అంటించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల పై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని, సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
అభిరామ్ అనే ఒక జర్నలిస్టు, ఆర్టీసీ బస్సుల పై అంటించే అశ్లీల పోస్టర్లను ఈ విషయాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ ట్వీట్ పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బస్సుల పై ఎలాంటి పోస్టర్లు లేకుండా, ఆర్టీసీ ఎండీగా చర్యలు తీసుకుంటామని sajjanar ప్రకటించారు. మరోవైపు, ఆర్టీసీలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు సజ్జనార్ ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.