Top 10 Movies: 2022 లో వరల్డ్ వైస్ గా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ మూవీస్
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి. మరికొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. వీటన్నింటిలో కొన్ని ఎక్కువ కలెక్షన్స్ అందిస్తూ ఉంటాయి. మరికొన్ని తక్కువ కలెక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన 10 మూవీస్ గురించి తెలుసుకుందాం.
కరోనా టైం లో ఓటిపి ప్రభావం వల్ల థియేటర్స్ కి ఎక్కువ మంది రారేమో అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. ఒకవేళ వచ్చినప్పటికీ వసూళ్లు పెద్దగా ఉండకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. థియేటర్లు కు పూర్వ వైభవం రావడం కలలో కూడా జరగదు అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఇలా ఈ విషయాలన్నీ కేవలం మాటల కు మాత్రమే పరిమితంగా మారాయి.
2020 లో చూసుకుంటే ఒక్కొక్క వేవ్ ఒక్కొక్క విధంగా అందరినీ బాధ పెడుతూ వస్తున్న దానికి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆడియన్స్ థియేటర్స్‌లోకి మళ్ళీ అడుగు పెట్టారు. రాను రాను వసూళ్లు కూడా పెరిగాయి. 2020లో అనుకున్నంత రేంజ్ లో వసూళ్లు కాకపోయినప్పటికీ, 2021లో తెలుగు సినిమాలు వందల కోట్ల మార్కెట్ వరకు చేరాయి.
ఇదే ఈ ఏడాది చూసుకుంటే వేల కోట్ల మార్క్ వరకు చేరుకుని ములపట్టి వైభవం థియేటర్స్ కి వచ్చింది. 2022 సంవత్సరంలో వరల్డ్ వైస్ గా ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాల గురించి తెలుసుకుందాం.
నెంబర్ -1-ఆర్ ఆర్ ఆర్
ఈ మూవీ దాదాపు 550 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ సంవత్సరం నెంబర్ వన్ స్థానంలో ఉంది.
నెంబర్ 2-సర్కారు వారి పాట
ఈ మూవీ 60 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. 180 కోట్లకు పైగా వసూలు చేసింది.
నెంబర్ 3-భీమ్లా నాయక్
ఈ మూవీ 70 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. 161 కోట్లకు పైగా వసూలు చేసింది.
నెంబర్ 4-రాదే శ్యామ్
ఈ మూవీ 151 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కానీ ఈ మూవీ రూపొందించడానికి దాదాపు 300 కోట్లు దాటి ఫెయిల్యూర్ గా నిలిచింది.
నెంబర్ -5 ఎఫ్ 3
బడ్జెట్ డెబ్బై కోట్లు, వసూళ్లు 134 కోట్లు.
నెంబర్ 6-కార్తికేయ 2
ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. 120 కోట్లు వసూలు చేసింది.
నెంబర్ 7-గాడ్ ఫాదర్
ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు, వసూళ్లు 150 కోట్లు.
నెంబర్ 8-సీతారామం
ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లు, వసూళ్లు 90 కోట్లు.
నెంబర్ 9-ఆచార్య
బడ్జెట్ 140 కోట్లు, వసూళ్లు 76 కోట్లు . ఈ మూవీ నష్టం కలిగించింది.
నెంబర్ 10-బింబిసారుడు
బడ్జెట్ 40 కోట్లు, వసూళ్లు 65 కోట్లు.