Allu Arjun:రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్.

Allu Arjun: సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లు సినిమాలలోనే కాక, నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటారు. మన టాలీవుడ్ లో అలాంటివారు చాలానే ఉన్నారు. కొంతమంది స్టార్స్ అయితే ఏకంగా ఊర్లనే దత్తత తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది పేదలకు సహాయం చేస్తున్నారు. ఇలా ఎక్కువగా వినబడిన వారి పేర్లలో చాలానే ఉన్నాయి. అందులో సోనోసూద్ ఒకడు. ఆయన చాలా రకాలుగా సహాయం చేశాడు. బీదవారు పొలం సేద్యం చేసుకునే సదుపాయం లేక, తమకు పుట్టిన కూతుర్లతో పొలం దున్నడం, ఆ విషయం తెలుసుకున్న సోను సూద్ వారికి ఒక ట్రాక్టర్ కొనిచ్చి ఇచ్చిన సంగతి, అప్పట్లో సోషల్ మీడియా అంతా ఒక ఊపు ఊపింది.

అలాంటి సంఘటననే ఇప్పుడు జరిగింది. అయితే పోలానికి ట్రాక్టర్ ఇచ్చాడు సోనుసూద్. ఇక్కడ అల్లు అర్జున్ ఒక అమ్మాయికి జీవితాన్నే ఇచ్చాడు. చదువు కోసం కావాల్సిన సహాయం చేశాడు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో అనిపించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరో లెవెల్ కు ఎదిగిపోయాడు. బాగా చదువుకొని జీవితంలో పై స్థాయికి వెళ్లాలని అనుకున్న, ఒక స్టూడెంట్ కు అండగా నిలబడి, తన చదువుకు కావాల్సిన సహాయం చేశాడు. విశేషం ఏమిటంటే తను హెల్ప్ చేసిన మెరిట్ స్టూడెంట్ ఒక అమ్మాయి. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా కాదు. కేరళకు చెందిన అమ్మాయి.

రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్.

కేరళ అమ్మాయి అయినా, తను ముస్లిం అమ్మాయి. నర్సింగ్ చేయాలని ఉంది. అదేవిధంగా నర్సింగ్ కోసం ఎంతో కష్టపడి చదివి, ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సంపాదించింది. అయితే నర్సింగ్ కోర్స్ నాలుగేళ్లు ఉంటుంది. అంతేకాక తన కుటుంబం ఎంతో పేదది. చదవటానికి డబ్బులు లేని పరిస్థితి. అయినప్పటికీ తను బాగా చదువుకొని, మంచి మార్కులు సంపాదించింది.

తన పరిస్థితి గురించి తెలుసుకున్న అక్కడి కలెక్టర్ వి ఆర్ కృష్ణ తన ఫేస్ బుక్ ద్వారా అల్లు అర్జున్ కు విషయాన్ని చెప్పాడు.

అందులో ఏమని మెసేజ్ చేశారంటే! అమ్మాయికి ఇంటర్లో 92% మార్కులు వచ్చాయి. అయితే ఉన్నత విద్య చదివించే స్తోమత తన కుటుంబానికి లేదని, వారు పేదవారని, అంతేకాకుండా పోయిన సంవత్సరం కరోనా వల్ల తండ్రి మరణించాడని, నర్స్ కావాలని, ఎగ్జామ్స్ రాసిన, ఆ అమ్మాయికి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సీటు రాలేదు. ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చింది. వారి పేదవారు కావటం వల్ల చదువు ఆగిపోతుందని, ఎవరైనా అమ్మాయికి సాయం చేసి, తన చదువుకోవడానికి అండగా ఉండాలని కోరాడు.

ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఆయనను సంప్రదించి, తను సాయం చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఒక సంవత్సరం కాదు, మొత్తం నర్సింగ్ పూర్తి చేయడానికి, నాలుగేళ్లకు కావాల్సినంత తను ఇస్తానని, అంతేకాకుండా తను హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కూడా సహాయం చేస్తానని చెప్పాడు. దీంతో సోషల్ మీడియా అంతా ఈ వార్త హల్చల్ చేస్తుంది. అక్కడ జిల్లా కలెక్టర్ హీరో అల్లు అర్జున్ కు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పాడు.