ప్రస్తుత కాలంలో రోజురోజుకు వ్యాధులు పెరిగిపోతున్నాయి. మామూలుగా వచ్చే సీజనల్ వ్యాధులు కాకుండా, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా వచ్చిన వ్యాధులలో కరోనా, మంకీ పాక్స్, చికెన్ పాక్స్ వంటి మొదలైన వ్యాధులు వచ్చాయి. ఇంకా ప్రపంచం వీటినుంచి పూర్తిగా కోల్పోక ముందే ప్రస్తుతం తాజాగా మరొక కొత్త వ్యాధి ప్రబలిస్తోంది.
దీనివల్ల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాధి టమోటా ఫ్లూ వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా భారతదేశంలో విస్తరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు ముందుచూపుతో చర్యలు చేపట్టవలసినదిగా టాన్సెట్ జనరల్ సంస్థ ఒక నివేదిక ద్వారా తెలియజేసింది.
ఈ వ్యాధి వల్లచేతులు, కాళ్లు ముఖంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి చూడటానికి అలర్జీలాగా ఉంటాయి. అలర్జీలో వచ్చే ఎర్రటి దద్దుర్లు ఈ వ్యాధులు కనిపిస్తాయి.
టమోటా ఫ్లూ వ్యాధి మొదటగా కేరళాలోని కొల్లంమ్ లో మే ఆరవ తేదీన మొదటి కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఇప్పటికీ 82 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకింది. దీనిలో ఎక్కువగా ఐదేళ్ల లోపు చిన్నపిల్లలు ఉండటం విశేషం. ఈ వ్యాధిని కోవిడ్ నాలుగో వేవ్ గా వైద్యులు గుర్తించారు.
ఈ వ్యాధి మొదట ఉదర భాగంలో పేగులకు వస్తుంది. తర్వాత క్రమంగా శరీర శరీరం అంతట పాకుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే పెద్దవారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించవు. పెద్దవారికి ఈ వైరస్ సోకినప్పుడు జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ల వాపు, అలసట వంటి లక్షణాల ద్వారా ఈ వైరస్ సోకిందని నిర్ధారణ చేసుకోవచ్చు.
మొదటగా కేరళలో సోకిన ఈ వ్యాధి ప్రస్తుతం అంచల్, అరియన్ కవు, నేడువత్తూర్, ప్రాంతాలకు సోకింది. ఏ కాక కేరళకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు ఒడిస్సాలో కేసులు నమోదయ్యాయి. భువనేశ్వర్ లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ పరీక్షలు జరిపి ఒడిస్సాలో 26 మంది చిన్నపిల్లలకు (1-9) టమోటా ఫ్లూ వ్యాధి వ్యాపించిందని తెలిపింది. వైరస్ కేవలం కేరళ, ఒడిస్సా, కర్ణాటక తప్ప మరి ఏ రాష్ట్రాలలో ఈ వ్యాధి సోకలేదు. ఇది స్వీయ నియంత్రణ వ్యాధి దేనికి నిర్దిష్టమైన చికిత్స చేసే టీకాలు లేవు.
టమోటా ఫ్లూ వ్యాధి లక్షణాలు:
1. ఈ వ్యాధి అంటువ్యాధి లాగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
2. చిన్నపిల్లలకు చేతులకు కాళ్లకు, నోటికి ,పెదవుల మీద ఎక్కువగా దద్దుర్లు వస్తాయి.
3.ఎక్కువ జ్వరం.
4. ఒళ్ళు నొప్పులు.5. కీళ్ల వాపు అలసట వంటివి లక్షణాలు ఉంటాయి.
ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి చాలా ఎక్కువసార్లు అనారోగ్యం కలిగించే జ్వరం, నోటిలో నొప్పితో కూడుకున్న పండ్లు, చేతులు, పాదాలు బొబ్బలతో దద్దుర్లు వంటి లక్షణాలు కూడా ఉంటాయి.