TS గురుకుల పాఠశాలల సిబ్బంది వేతనాలు పెంపు

TS గురుకుల పాఠశాలల సిబ్బంది వేతనాలు పెంపు. పార్ట్ టైం సిబ్బంది గా పనిచేస్తున్న గురుకుల పాఠశాలలో వేతనాలు పెంచారు.

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పార్ట్ టైం బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2022 నుంచి పెంచిన వేతనం వర్తిస్తుంది.

TSWRS



సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి డి రోనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ లెక్చరర్ 30,000 నుంచి 32,500 వరకు, జూనియర్ లెక్చరర్ 18,000 నుంచి 23,400 వరకు, పీజీటి/ టీజీలకు 14,000 నుంచి 18,200 వరకు కంప్యూటర్ ఇన్స్రక్టర్లు, పీటీలు, స్టాప్ నర్సులకు 10,900 నుంచి 14,170 వరకు పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలకు 62 మంది వీఆర్వోలను కేటాయించిన నేపథ్యంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ సిహెచ్ బాలరాజు ఓ ప్రకటనలో తెలిపారు.