ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సేవలను రీ లాంచ్ చేయనున్న ట్విట్టర్ కొత్త బాస్

సోషల్ మీడియాలో భాగంగా ఉండే ట్విట్టర్ ను ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్, 44 బిలియన్ డాలర్లు తో కొనుగోలు చేశాడు. ఈయన ట్విట్టర్ కి కొత్త బాస్. బిలియనీర్ కూడా. రెండు పెద్ద సంస్థలకు సీఈఓ గా పని చేస్తున్నారు. మైక్రోబ్లాంగింగ్ సైట్ ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఎలాన్ మస్క్. ఈయన ట్విట్టర్ కి సంబంధించి ఒక కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నాడు.

ప్రస్తుతం బ్లూటిక్ వెరిఫికేషన్ తో కూడిన ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సేవలను ఎలాన్ మస్క్ నిలిపివేశారు. మొదట దీన్ని ఈయన నవంబర్ ఆరవ తేదీన లాంచ్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని నిలిపివేయడం జరిగింది. మరల నవంబర్ 29న ఈ సేవలను లాంచ్ చేస్తున్నట్లు మస్క్ అధికారికంగా ప్రకటించారు.

ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సేవలను రీ లాంచ్ చేయనున్న ట్విట్టర్ కొత్త బాస్

ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని లాభాల్లో నడిపించాలని అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాడు. దీంట్లో భాగంగా బ్లూ టిక్ తో కూడిన ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను ఈనెల ఆరో తారీఖున లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే అనేక ఫేక్ అకౌంట్స్ హల్చల్ చేసి పెద్ద గందరగోళానికి దారి తీసాయి. ఈ కారణంగా మాస్క్ మొదటగా ఈ సేవలను లాంచ్ చేసిన తర్వాత నిలిపివేయడం జరిగింది.

తిరిగి నవంబర్ 29వ తేదీ ఈ సేవలను మరల అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈయన అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈసారి మనం తీసుకొచ్చే ఈ ప్లాన్ మళ్లీ మళ్లీ మార్చాల్సిన అవసరం లేకుండా అంతా సేఫ్టీ గా ఉంటుంది అని తెలియజేశారు. మళ్ళా ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు, ఈసారి విడుదల చేసే ఈ ప్లాన్ లో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు 29వ తేదీ వరకు సమయం తీసుకున్నామని ఒక ట్రీట్ ద్వారా తెలియజేశారు.

ఈయన ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత మొదటి రోజు నుంచి7.99 డాలర్లకి వెరిఫికేషన్ తో కూడిన చెక్ మార్కుతో కూడిన ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకొస్తానని చెప్తూ వస్తున్నారు.

దీంట్లో భాగంగా ఈ సేవలను నవంబర్ ఆరో తారీఖున అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన కొన్ని గంటలకి అసలైన ప్రముఖుల అకౌంట్స్ కి, వారిలాగా నటించే ఫేక్ అకౌంట్స్ కి మధ్య తేడా తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది.

దీంట్లో భాగంగానే ఫార్మా స్యుటికల్ కంపెనీ ఎలిలీని అనుకరిస్తూ ఒక అకౌంట్ “ఇన్సులిన్ ఇప్పుడు ఉచితం.”అని ఒక ట్వీట్ చేసింది. ఇది నిజమే అని అందరూ భ్రమపడ్డారు. ఇలా అనుకోవడం ద్వారా ఆ కంపెనీ తన మార్కెట్ విలువలో1.20 లక్షల డాలర్లను కోల్పోయింది.

ఈ విషయం జరగడంతో ఎలా న్ మస్క్ పై కూడా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణం ద్వారా ఈ సేవలను నిలిపివేయడం కూడా జరిగింది. మళ్లీ నవంబర్ 29వ తారీకు సేవలను రీ లాంచ్ చేస్తున్నారు.