Vinayaka Chaturthi వినాయక వ్రత కథ గురించి తెలుసా?

వినాయకుడి వ్రత కథ గురించి తెలుసా?

ధర్మరాజు జూదం లో ఓడిపోయి తన భార్య తమ్ముళ్ళతో అడవిలో నివసిస్తూ, నైమిశారణ్యానికి చేరుకొని అక్కడ ఉన్న సూత మహర్షిని కలుసుకుంటాడు. అప్పుడు సూతమహర్షి వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌకర్యాలు కలుగుతాయని చెప్పి, కుమారస్వామికి శివుడు ఏ విధంగా వినాయక వ్రతం చేసుకోవాలి వర్ణించిన విధానాన్ని తెలుపుతాడు.

అలాగే నువ్వు కూడా వినాయక వ్రతాన్ని ఆచరించు, నీకు సకల సౌఖ్యం కలుగుతాయి అని చెబుతూ గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమని తో పాటు జాంబవతి సత్యభామలను భార్యలుగా పొందాడు అని చెప్పాడు. అలాగే పూర్వం గజముకుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలని కోరాడు. దాంతో శివుడు తనకు ఇచ్చిన మాట ప్రకారం తన కోరికను నెరవేర్చాడు. పార్వతీదేవి భర్తను వెతుకుతూ గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకొని ఆయనను దక్కించుకోవడం కోసం శ్రీమహావిష్ణువుని వద్దకు వెళ్లి ప్రార్థిస్తుంది. ఆయన మొత్తం లోకాలలో ఉండే దేవతలను పిలిపించి, ఈ విషయం గురించి చర్చించి, గజాసుర సంహారానికి గంగిరెద్దు మేలమే  తగినది అని నిర్ణయించి.

నందీశ్వరుడిని గంగారెద్దుగా అలంకరించి అలంకరించారు. అలాగే దేవతలు తలకొక వాయిద్యాన్ని ధరించుకున్నారు. మహావిష్ణువు కూడా చిరుగంటలు, సన్నాయిలు అలంకరించుకున్నాడు. గజాసురపురానికి పురాణానికి వెళ్లి గంగిరెద్దును  ఆడిస్తుండగా గజాసురుడు వారిని పిలిపించి, తన భవనం ఎదురుగా గంగిరెద్దులను ఆడించమని కోరుకుంటాడు. దేవతలు అందరూ వాయిద్యాలు వాయిస్తుండగా శ్రీహరి గంగిరెద్దును ఆడించాడు.

గజాసురుడు ఆనందంతో ఏమి కావాలో కోరుకోమని చెప్పాడు. శ్రీహరి తన దగ్గరికి వెళ్లి, ఇది శివుని వాహనమైన నంది. ఆయనను కనుక్కోవడానికి వచ్చింది. శివుడిని అప్పగించమని కోరుకుంటారు. వచ్చినది మహావిష్ణువు అని తెలుసుకొని తన మరణం ఖచ్చితమని, తన గర్భంలో ఉన్న పరమశివుని ఉద్దేశించి, నా శిరస్సును త్రిలోకపుజముగా చేసి, నా చర్మాన్ని మీరు ధరించి అని వేడుకుంటాడు. ఆ తర్వాత తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అనుమతిని తెలియజేస్తాడు.

అప్పుడు శ్రీహరి నందికి తన కొమ్ములతో ఉదరాన్ని చిల్చేయమనగా, నంది అలాగే అని ఉదరాన్ని చీల్చేస్తుంది. అందులో ఉన్న శివుడు బయటికి వచ్చాడు.   బ్రహ్మదేవులకు శ్రీహరి వీడ్కోలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివుడు నందెక్కి కైలాసానికి వెళ్ళాడు.

వినాయకుడి జననం:

కైలాసంలో పార్వతి భర్త రాక గురించి విని సంతోషం అనిపించి, స్వాగతం చెప్పేందుకు, స్నానం అలంకారాల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో  ఆ ప్రతిమకుప్రాణప్రతిష్టచేసింది.

అతనిని వాకిట్లో ఉంచి, ఎవరిని లోనికి రానివ్వద్దు, అని చెప్పి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి శివుడు వచ్చాక వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో, రౌద్రంతో ఆ బాలుని శిరచ్చేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకున్న పార్వతీదేవి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును తన బాలుడికి మొండడానికి అతికించి అతనికి తిరిగి ప్రాణం పోశాడు. అప్పుడే  వినాయకునిగా జన్మించాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి కూడా జన్మించాడు.

విఘ్నములకు అధిపతిగా మారిన విగ్నేశ్వరుడు: ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమశివుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. అప్పుడు  గణేశుడు నేను పెద్దవాడిని కనుక ఆ ఆధిపత్యం నాకు ఇవ్వమని శివున్ని కోరుకున్నాడు.  గణేషుడు ఇందుకు అర్హుడు కాదు, అసమర్థుడు, మరుగుజ్జువాడు కాబట్టి ఆధిపత్యాన్ని నాకే ఇవ్వండి అని కుమారస్వామి కూడా వేడుకున్నాడు. మీ ఇద్దరిలో ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు ఎవరు వస్తే ,వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని శివుడు ఆజ్ఞాపించాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు.

గణేశుడు తాను నదులన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టమని, దానికి తగిన ఉపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు శివుడు వినాయకునికి నారాయణ మంత్రాన్ని చెప్పాడు. జలములు జలమూలన్నీ నారాయణి ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షణం చేయడం ప్రారంభించాడు.

ఆ మంత్ర ప్రభావం వల్ల ప్రతి నదిలోను, కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం, స్నానమాచరించడం ప్రారంభించాడు. ఇలా మూడు కోట్ల 50 లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానం చేయడం చూసిన కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు.

అక్కడ తండ్రి పక్కనే ఉన్న వినాయకుడిని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక అధిపత్యము అడిగాను క్షమించండి. ఈ ఆదిపత్యం అన్నగారికే ఇవ్వండి అని వేడుకుంటాడు. ఈ విధంగా వినాయకుడు విజ్ఞాలకు ఆధిపత్యాన్ని పొందుతాడు. ఈ విధంగా వినాయకుడు జన్మించి విజ్ఞాలకు అధిపతి అయ్యాడు.