లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం పొందాలంటే ఏం చేయాలో తెలుసా?

Siva

25వ తేదీ గ్రహణం ఉన్న కారణంగా 24వ తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలని పండుతారాధ్యులు చెబుతున్నారు.

లక్ష్మీ అమ్మవారి పూజ 24వ తేదీన సాయంత్రం 5:39, ప్రారంభం చేసుకుని,6:51 నిమిషాలకు ముగించవలెను.

ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసుకొని ఆ ముగ్గులలో నలుపు రంగు లేకుండా అలంకరించుకోవాలి.

దీపావళిలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.  లేదర్ తో తయారు చేసినవి ఇవ్వకూడదు.

పండుగ రోజు వేసుకునే బట్టలలో నలుపు రంగు కలవకుండా ఉన్న బట్టలు వేసుకోవాలి.

దీపావళి పండుగ రోజున ఇతరులతో గొడవలకు వెళ్ళకూడదు.

ఎవరిని తిట్టుకోకూడదు, కోపంగా వ్యవహరించకూడదు.

ముదురు గోధుమ రంగు ఉన్న ఆవులను చూస్తే డబ్బుకు కొరత ఉండదని, మీయొక్క వైభవమే మారుతుందని పండితులు చెబుతున్నారు.

దీపావళి పండుగ రోజు పిల్లిని చూస్తే అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

పండుగ రోజు ఇంట్లో బల్లులు ఉంటే అమ్మవారు ఆ ఇంటిలోనికి వస్తున్నారని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

పండుగ రోజున గుడ్లగూబ కనిపిస్తే వారికి పట్టే అదృష్టం అంతా కాదని, వారి జీవితమే మారిపోతుందని అంటున్నారు.

బ్రహ్మ స్థలం అంటే ఇంటి మధ్య స్థలం. దీపావళి రోజున బ్రహ్మ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

25వ తేదీ గ్రహణ సమయం మధ్యాహ్నం 2:25 నిమిషాల నుండి సాయంత్రం 6:32 నిమిషాల వరకు ఉంది.

స్వాతి నక్షత్రం, తులారాశి వారు ఎటువంటి పరిస్థితులలో గ్రహణాన్ని చూడకూడదు.

తులా రాశి, కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి ఉన్నవాళ్లు గ్రహణం తర్వాత కచ్చితంగా పరిహారం చేసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.