చిరంజీవి గారి పూర్తి పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్, ఈయన మొగల్తూరులో1955 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన జన్మించారు.

మెగాస్టార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

Happy birthday to Megastar

టాలీవుడ్ లో వచ్చే ప్రతి హీరోను ప్రోత్సహించే వారిలో ముందంజలో ఉంటారు.

1978లో వచ్చిన   పునాదిరాళ్లు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

మన తెలుగులో150 కి పైగా సినిమాలలో నటించాడు.

తాజాగా ఆచార్య అనే సినిమాలో  కొడుకు రామ్ చరణ్ కలిసి నటించారు.

చిరంజీవి గారి సోదరీమణులు రాఖీ కట్టినందుకుగాను, సోదర భావంతో హైదరాబాద్ చివరులలో ఉన్న కొన్ని స్థలాలను వారికి బహుమతిగా రాసి ఇచ్చాడు.

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ప్రస్తుత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంతకుముందు ఈ పార్టీలోనే చేరాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

చిరంజీవి గారు ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనిని ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నారు

1980వ సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీన హాస్యనటుడు అల్లూరి రామలింగయ్య గారి కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు.

ఈ సినిమాలే కాక "మెగా 154" అనే సినిమాలో కూడా చేయబోతున్నారు.

బోలా శంకర్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆటో జానీ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు, దీనిని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలుపుతుంది.

చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమానం గలదు.