గట్టిగా కౌగిలించుకుంటే ఫైన్ వేస్తారా?

మానవులు సంతోషాన్నైనా  లేదా ప్రేమనైనా ఇతరులను కౌగిలించుకోవడం ద్వారా తెలియజేస్తారు.

చెడు ఉద్దేశంతో కౌగిలించుకుంటే దానిని ద్రుతరాష్ట్రుని కౌగిలి అంటారు.

ధృతరాష్ట్ర కౌగిలి లాంటి ఒక సంఘటన చైనాలోని ఒక మహిళకు జరిగింది.

తన సహ ఉద్యోగి తనను గట్టిగా కౌగిలించుకున్నాడని 2021లో ఒక మహిళా ఉద్యోగి కేసు నమోదు చేసింది.

తన సహ ఉద్యోగి గట్టిగా కౌగిలించుకున్నందుకు తనకు మూడు ప్రక్కటెముకలు విరిగిపోయాయి అని కోర్టులో కేసు వేసింది.

ఈ సంఘటన జరగడానికి ముందు రోజులలో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ పనులు మహిళ చేయలేదని కోర్టు నిరూపించింది.

నిందితుడు10,000 యువాన్లు అనగా 1.16 లక్షలు పరిహారంగా చెల్లించమని కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.