విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక
విశాఖపట్నం, సెప్టెంబరు 6: వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాలకు ఏమైన సమస్యలు ఏర్పడితే ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు.
విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ – 1800-425-00002
0891-2590100
0891-2590102
సబ్ కలెక్టర్, పాడేరు – 08935- 250228
ఆర్ .డి.ఓ.విశాఖపట్నం – 0891- 2562977
ఆర్.డి.ఓ. అనకాపల్లి – 08924- 223316
ఆర్.డి.ఓ. నర్సీపట్నం – 08932 -226433