Mukesh Ambani: దాదాపుగా 100 నగరాల్లో జియో 5జీ నీ స్థాపిస్తున్న ముకేష్ అంబానీ
టెలికాం దిగ్గజం అయిన జియో దేశంలోని దాదాపు 1000 నగరాల్లో 5జీ అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేసి పెట్టింది. సొంత 5జీ టెలికాం గేర్లతో ఇప్పటికే క్షేత్ర స్థాయి పరీక్షలను నిర్వహించినట్లు మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదిక 2021-2022లో తెలియజేయడం జరిగింది. 6జీ పరిశోధన లో ముందున్న పిన్ ల్యాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఓలుతోను జియో చేతులు కలిపినట్టు తెలిపింది. టెలికాం రంగంలో జియో తో ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో,భవిష్యత్తులో హరిత ఇంధన వ్యాపారంలోనే అదే తరహా దూకుడు చూపించాలని రిలయన్స్ సంస్థ అభిప్రాయపడుతుంది.
ఈ రంగంలో ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. వచ్చే 12 నెలల్లో హరిత ఇందన వ్యాపారంలో మా పెట్టుబడులు ప్రారంభం చేస్తామని కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ చెప్పడం జరిగింది. వచ్చే ఐదు నుంచి ఏడు ఏళ్లలో ఈ కొత్త వ్యాపారం ప్రస్తుత అన్ని వ్యాపారాల అన్నిటికి కంటే బాగా నడుస్తుందని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ అంచనా వేశారు. ప్రజలకు ఏ కొత్త సాంకేతికతను దగ్గర చేయాలన్న కూడా ప్రయోజనం చేకూర్చాలన్న కూడా అందుబాటు ధర చాలా కీలకమైనదని మాకు తెలుసు. వైర్ లెస్ బ్రాండ్ తో సృష్టించిన రికార్డులను ఈ రంగం లో తిరగ రాస్తామని ఆయన చెప్పారు.
2021-2022 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్ వ్యాపారంలో 30,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది.2,500 కొత్తవి జత చేయడంతో స్టోర్ల సంఖ్య మొత్తం 15,196 కు చేరుకుంది. గిడ్డంగుల స్థలాన్ని రెట్టింపు చేసి 22.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. గత ఆర్థిక ఉద్యోగాలు 1.5 లక్షలకు పైగా ఇవ్వడంతో మొత్తం3.61 లక్షలకు సిబ్బంది సంఖ్య చేరుకుంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా వేతనం ఏమాత్రం తీసుకోలేదు. వ్యాపారాలు,ఆర్థిక వ్యవస్థ పై కొవిడ్ ప్రభావం పడడం వల్ల 2020-21 లో తన వేతనాన్ని వడిలేసుకుతున్నట్టు జూన్ 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ప్రకటించడం జరిగింది.
2021-22లోనూ ముకేశ్ అంబానీ సున్న వేతనాన్ని పొందడం జరిగింది. ఈ రెండు సంవత్సరాల లో ఎటువంటి బాత్యాలు,ప్రయోజనాలు, స్టాక్ఆప్షన్లు ను ముకేశ్ అంబానీ పొందలేదు.2008-09 నుంచి వార్షిక వేతనాన్ని పరిమితం చేసుకున్నాడు.2019-20వరకు ప్రతి సంవత్సారం 15 కోట్ల చొప్పున రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అందుకున్నారు. ముకేశ్ అంబానీ బంధుమిత్రులైన నిఖిల్,హితాల్ మేశ్వనీల వార్షిక వేతనం 24 కోట్ల రూపాయల వద్దే ఎలాంటి మార్పు లేకుండా వుంది. వారికి 17.28 కోట్ల కమిషన్ జత చేరడం జరిగింది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ లైనా పీఎమ్ఎస్ ప్రసాద్ కు 11.99 కోట్ల రూపాయల నుంచి11.89 కోట్ల కు,పవన్ కుమార్ కపిల్ కు 4.24 కోట్ల నుంచి 4.22 కోట్ల రూపాయల కు వేతనం తగ్గింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ యొక్క భార్య నీతా అంబానీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సిట్టింగ్ ఫీజు రూపంలో ఐదు లక్షల రూపాయలు కమిషన్ రూపంలో 2 కోట్ల రూపాయలు పొందారు.